Pawan-Akira: పవన్‌ను మించి అకీరా నందన్ క్రేజ్ సంపాదించుకుంటారా?

Pawan-Akira: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ సినిమాల కంటే ఎక్కువగా ఆయన వ్యక్తిత్వానికే చాలా మంది అభిమానులుగా మారిపోతారు. అంతగా ఆయన తన ప్రభావం చూపిస్తారు. సమాజం అంటే పడిచచ్చే పవన్.. ప్రజల కోసం ఎప్పుడూ ఏదో చేయాలని తపన పడుతుంటారు. ఆ తపన ఆయన చేసే సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ కనిపిస్తుంది.

 

సినిమాల పరంగా చూసుకంటే పవన్ ఓ సంచలనం అంటే అనాలి. ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, ‘బద్రి’, ‘తొలిప్రేమ’, ‘ఖుషి’ లాంటి చిత్రాలు టాలీవుడ్ లో పవన్ ను పవర్ స్టార్ గా చేశాయి. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు పవన్ క్రేజ్ ను ఈతరంలోనూ విపరీతంగా పెంచేశాయి. అలాంటి పవన్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు. ‘సాహో’ ఫేమ్ సుజిత్ తోపాటు హరీష్ శంకర్ సినిమాలను ఆయన పైప్ లైన్ లో ఉంచారు.

 

ఇకపోతే పవన్ కల్యాన్​ పెద్ద కొడుకు అకీరా నందన్ త్వరగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్​ తేజ్ కంటే ఎత్తుగా ఉన్న అకీరా.. లుక్స్ లోనూ పవన్ ను మైమరిపిస్తున్నారు. ఆయన ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఎంట్రీ ఇస్తే రికార్డులు బద్దలే..!

అకీరా ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్న క్రమంలో ఆయన త్వరగా తెరంగేట్రం చేస్తే బాగుంటుందని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ అకీరా సినిమాల్లోకి వస్తే పవన్ ను మించిన క్రేజ్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. పవన్ కొడుకు ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వాల్సిందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి, అకీరా నందన్ చిత్ర పరిశ్రమలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -