Pawan Comments: పవన్ కామెంట్లలో వాస్తవాలివే.. ఆ నిర్మాతలను ముంచేశారా?

Pawan Comments: పవన్ ప్రస్తుతం వారాహి యాత్రలో భాగంగా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ పై తీవ్ర స్థాయిలో విడుచుకుపడుతూ తనకు గెలవడానికి ఒక్క అవకాశం ఇవ్వమని ప్రజలను వేడుకుంటున్నారు పవన్. ఆ సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభానికి ముందు పవన్ కలిసేందుకు, అతడితో సినిమాలు చేస్తున్న నిర్మాతలు అందరు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వచ్చిన విషయం తెలిసిందే. పవన్ ను కలిసి ఆయనకి శుభాకాంక్షలు కూడా తెలిపారు.

అదే సమయంలో పవన్ కోసం తమ సినిమాల షూటింగ్స్ ను ఏపీ లోనే నిర్వహిస్తామని ప్రకటించారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, కర్నూలు లాంటి సిటీల పేర్లు కూడా అప్పట్లో తెరపైకీ వచ్చాయి. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం మంగళగిరిలో సెట్ వేస్తారని, హరిహర వీరమల్లు కోసం కర్నూలు లో సెట్ వేయనున్నారు అంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. సీన్ కట్ చేస్తే నిర్మాతలు చెప్పారు కానీ ఏపీలో పవన్ సినిమాల కోసం ఎక్కడ ఏ సెట్ వేశారనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. వారాహి యాత్ర ప్రారంభానికి ముందు పవన్ సినిమాల స్టేటస్ ఎలా ఉందో, ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నాయి.

 

మధ్యలో ఓజీ సినిమా షూటింగ్ మాత్రం 50 శాతం పూర్తయినట్టు ప్రకటన వచ్చింది. మిగతా సినిమాల అప్ డేట్స్ లేవు. ఈ గ్యాప్ లో బ్రో సినిమా టీజర్ కోసం పవన్ డబ్బింగ్ చెప్పినట్టు కొన్ని స్టిల్స్ బయటకు వచ్చాయి. ఇంతకుమించి పవన్ సినిమాలకు సంబందించి ఎటువంటి అప్ డేట్స్ లేవు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు పవన్. అటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా తెరకెక్కుతున్నాయి. వీటి నెక్ట్స్ షెడ్యూల్స్ వివరాలపై సదరు యూనిట్స్ నుంచి అధికారిక ప్రకటన లేదు. అయితే అనారోగ్యం కారణంగా తన వారాహి యాత్రలకు పవన్ చిన్న బ్రేక్ ఇచ్చారు. తిరిగి ఆయన తన పర్యటనల్ని కొనసాగించబోతున్నారు. ఈ రాజకీయ పర్యటనలు ఎప్పుడు ఆపుతారు, తిరిగి ఎప్పుడు సెట్స్ పైకి వస్తారు. వస్తే ఏ సినిమాకు ముందుగా కాల్షీట్లు ఇస్తారనే అంశాల ఆధారంగా ఈ సినిమాల నుంచి ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -