Prabhas Fan: ప్రభాస్ ఫ్యాన్ చేతిలో చనిపోయిన పవన్ ఫ్యాన్.. ఏమైందంటే?

Prabhas Fan: సాధారణంగా స్టార్ హీరోలు అందరూ కలిసి ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం మా హీరో గొప్ప మా హీరో గొప్ప అంటూ తిట్టుకోవడం కొన్ని కొన్ని సార్లు కొట్టుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు చాలామంది హీరోలు హీరోలు అందరూ ఒకటే అభిమానులు కూడా ఒక్కటిగా ఉండండి అని చెప్పినప్పటికీ అభిమానుల తీరు మాత్రం మార్చుకోవడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోల పై ఉన్న అభిమానం హద్దులు దాటిపోయింది. ఏకంగా ఒక స్టార్ హీరో అభిమాని మరో స్టార్ హీరో అభిమానిని చంపేశాడు. ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.

ఈ దారుణం పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో చోటు చేసుకుంది. తమ అభిమాన హీరోల గురించి ఇద్దరు పెయింటర్ల మధ్య గొడవ మొదలైంది. ఏలూరుకు చెందిన పెయింటర్లు అత్తిలి మసీదు వీధిలో నజీర్ అనే వ్యక్తి ఇంటికి పెయింట్స్ వేస్తూ గొడవ పడ్డారు. ఆ గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి ఏకంగా ఒకరు చనిపోయారు. మూడు రోజుల క్రితం పెయింటర్లు హరికుమార్, కిషోర్ అత్తిలి వెళ్లారు. పెయింటర్ హరికుమార్ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్ కావడంతో అతను తన వాట్సాప్ లో ప్రభాస్ వీడియోను స్టేటస్ గా పెట్టుకున్నాడు. ఇక మరో పెయింటర్ కిషోర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని.

 

నేను పవన్ ఫ్యాన్ ని, నువ్వు కూడా ప్రభాస్ వీడియో తీసి పవన్ వీడియోని స్టేటస్ గా పెట్టుకో అని హరికుమార్ ను కోరాడు కిషోర్. దానికి హరికుమార్ ఒప్పుకోలేదు. నేను ప్రభాస్ కి వీరాభిమానిని, ప్రభాస్ వీడియోనే పెట్టుకుంటాని తేల్చి చెప్పాడు. అలా వారిద్దరి మధ్య స్టేటస్ వీడియో విషయంలో వాగ్వాదం జరిగింది.

ఈ నేపథ్యంలోనే ఇద్దరూ తీవ్రంగా కొట్టుకున్నారు. కోపంతో ఊగిపోయిన హరికుమార్ సెంట్రింగ్ కర్రతో కిషోర్ తలపై బలంగా కొట్టాడు. అంతేకాదు సిమెంటు రాయితో ముఖం మీద కొట్టాడు. అంతే, తీవ్రగాయాలతో కిషోర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన తర్వాత హరికుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. రంగంలోకి దిగిన తణుకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న హరికుమార్ ను పట్టుకునే పనిలో పడ్డారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. హీరోల పేర్లు చెప్పుకుని మర్డర్లు చేసుకోవడం షాక్ కి గురి చేసింది. హీరోలపై అభిమానం ఉండవచ్చు కానీ ఇలా చంపుకునే అంత అభిమానం ఉండకూడదు అంటూ చాలామంది మండిపడుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -