Pawan: పవన్ ప్రేమకు ఫిదా కావాల్సిందే.. ఆ సమయంలో అలా చేశానంటూ?

Pawan: సాయి ధరమ్ తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన తాజా చిత్రం బ్రో. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీకి కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సందర్భంగా తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాదులోని శిల్పకళా వేదికలో నిర్వహించారు.

ఈ ఈవెంట్ కి మెగా వారసులు వరుణ్ తేజ్,వైష్ణవ్ తేతేజ్ జులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథకి సాయి ధరమ్ తేజ్ రియల్ లైఫ్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ మూవీ ఓకే చేసే సమయంలోనే తనకి యాక్సిడెంట్ అయ్యింది. త్రివిక్రమ్ ఇంటిలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది. వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాను. చిన్న యాక్సిడెంటే అనుకున్నాను. ఇంకో గంటలో బయటకి వచ్చేస్తాడు అని అనుకున్నాను. కానీ బయటకి రావడం లేదు. నాకు తెలియని ఒక నిస్సహాయత వచ్చేసింది. పెద్ద పెద్ద డాక్టర్స్ వస్తున్నారు, చూస్తున్నారు. కానీ ఏమి చెప్పలేకపోతున్నారు.

 

అప్పుడు నాకు చాలా భయం వేసింది. సినిమాల్లో మాదిరి గుళ్ళకి వెళ్లి పూజలు, వ్రతాలు చేయలేము. దీంతో తెలియని నిస్సహాయత ఒక మూలన కూర్చుని మనసులో ఏడ్చాను. వాడికి ఇంకా జీవితం ఉంది వాడిని కాపాడు అని నేను పూజించే దేవతని కోరుకున్నాను. తనని కాపాడిన డాక్టర్స్‌కి, అంతకంటే ముందు రోడ్డు మీద పడి ఉన్న తనని వెంటనే హాస్పిటల్ కి తరలించిన అబ్దుల్ పర్హాన్ కి ఎప్పటికి రుణపడి ఉంటాను. ఈ సినిమా సమయంలో కూడా తేజ్ మాటల రాక చాలా కష్టపడ్డాడు. అయితే దర్శకుడు సముద్రఖని తనని జాగ్రత్తగా చూసుకొని తనతో డైలాగ్స్ చెప్పించారు అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -