Pawan Kalyan: మూడో భార్యకు విడాకులు ఇస్తున్న పవన్.. ఏమైందంటే?

Pawan Kalyan: ఏపీలో పొలిటికల్ హీట్ మొదలైంది. ఎన్నికలకు ముందుగా ఒకరికొకరు తమ వ్యక్తిగత విషయాలను ఎత్తిచూపుతూ నాయకులు కామెంట్స్ చేసుకుంటున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని, రెండో భార్య రేణు దేశాయ్ అని, మూడో భార్య అన్నా లెజ్నెవా మరి నాలుగో భార్య ఎవరు అంటూ పదే పదే వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

 

గత కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ పై వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఇంకోసారి విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి గురించి వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ఈ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నట్లు నెట్టింట కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

 

పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లిపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలుస్తోంది. ఇదంతా కూడా కేవలం దుష్ప్రచారం అని, పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవాతో సఖ్యతగానే ఉంటున్నారని, ఇరువురి మధ్యా ఎలాంటి అభిప్రాయ బేధాలూ లేవని, అయితే ఇదంతా వైసీపీ నుంచి వస్తున్న ప్రచారమేనని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

 

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించారు. ‘యువశక్తి’ పేరుతో జనసేన పార్టీ ఓ భారీ బహిరంగ సభ ఉత్తరాంధ్రలో నిర్వహించనుందని సమాాచారం. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందనీ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీ కావాలనే తమపై బురదజల్లే ప్రయత్నం చేేస్తూ పుకార్లను తెరపైకి తెచ్చిందనీ జనసేన ఆరోపణలు చేస్తోంది. అయితే వైసీపీ మద్దతుదారులు తప్పా, వైసీపీ నేతలెవరూ ఇంతవరకు ఈ విషయమై స్పందించలేదని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -