Pawan Kalyan: బహిరంగంగా రేణు దేశాయ్ కి ఇచ్చిన భరణం గురించి బయటపెట్టిన పవన్?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ ప్రచారంలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మంగళగిరిలో ఈయన పర్యటించిన సమయంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి నాయకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికార నేతలను ఉద్దేశిస్తూ ఎప్పుడు లేని విధంగా వారిపై మండిపడ్డారు.

ఇకపోతే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు తరచు పవన్ కళ్యాణ్ ను మూడు పెళ్లిళ్ల గురించి అతను ప్యాకేజీ గురించి మాట్లాడుతూ విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు. తరచూ తన మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావన తీసుకువస్తున్నారని అయితే ప్రతిసారి మూడు పెళ్లిళ్లు చేసుకున్న అంటున్నారు మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారు అంటూ ఈయన ప్రశ్నించారు.

ఇక తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ వారితో విడాకులు తీసుకునే సమయంలో వారికి భారీ మొత్తంలో భరణం అందించానని ఈ సందర్భంగా పవన్ వెల్లడించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన మొదటి భార్య నందిని వివాహం చేసుకున్న తర్వాత తనతో వర్కౌట్ కాకపోవడంతో ఆమెకు విడాకులు ఇచ్చి ఐదు కోట్ల భరణం ఇచ్చానని తెలిపారు.

నందినికి విడాకులు ఇచ్చిన తర్వాత నటి రేణు దేశాయిని పెళ్లి చేసుకున్నటువంటి ఈయన ఆమెకు విడాకులు ఇచ్చే సమయంలో ఆస్తి మొత్తం రాసిచ్చానని బహిరంగంగా ప్రకటించారు. ఇక ప్రస్తుతం తాను అన్నా లెజినోవాను పెళ్లి చేసుకొని తనతో కలిసి ఉంటున్నానని ఈ సందర్భంగా తన మాజీ భార్యల గురించి వారికి ఇచ్చిన కట్నం గురించి మాట్లాడటంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -