Pawan Kalyan: జనసేనాని అంటే జగన్ కు వణుకా.. పవన్ హెలికాఫ్టర్ కు కూడా అనుమతులు ఇవ్వట్లేదా?

Pawan Kalyan: అధికార వైసీపీ మరోసారి అధికారంలోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. అయితే.. ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టడమో.. లేకపోతే.. వైసీపీ అబాసుపాలు కావడమో జరుగుతోంది. జగన్ తన ఇంటి నుంచి బయటకు రావాలంటే హెలికాప్టర్‌లో ఎగరాల్సిందే. దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. పైగా ప్రజల నుంచి వస్తున్న పన్నుల సొమ్ము ఉంది కనుక ఖర్చులకు డోకా లేదు. 30 కిలో మీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ ఎక్కేస్తారు. కానీ, విపక్షనాయకులు హెలికాప్టర్ ఎక్కాలంటే మాత్రం.. పైగా సొంత డబ్బులతో ప్రయాణించాలన్నా ప్రభుత్వం పర్మిషన్ కావాలంట. జనసేన అధినేత పవన్ భీమవరంలో పర్యటనకు ప్లాన్ చేశారు. దాని కోసం ప్రభుత్వం పవన్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వలేదు. దానికి అర్థం లేని కారాణాలు ఎన్నో చెప్పింది. అయితే, ఒకటి కూడా సహేతుకంగా లేదని జనసేన నాయకులు చెబుతున్నారు.

చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా పవన్ హెలికాప్టర్ కు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో.. ఆయన రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలని ప్లాన్ చేశారు. దీంతో.. ఆయన్ని రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. ఆరోజు పోలీసులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే, పెద్ద ఎత్తున జనసైనికులు రావడంతో పోలీసులు ఒకింత ఆందోళనకు గురై పర్మిషన్ ఇచ్చారు. అది కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్ కు వెళ్లడానికే పర్మిషన్ ఇచ్చారు.

అయితే, ఇప్పుడు భీమవరం మీటింగ్ కు వెళ్లడానికి హెలికాప్టర్ ల్యాండింగ్ కు పర్మిషన్ ఇవ్వలేదు. మరి రోడ్డుమార్గాన కూడా గతంలో లాగే అడ్డుకుంటే ఏంటి పరిస్థితి? ఎన్నికల సమయంలో అందరూ పర్యటనలు, యాత్రలు చేస్తారు. ఏవో కారణాలు చెప్పి విపక్షనేత పర్యటనలు అడ్డుకోవాలి అనుకుంటే ఎలా? అధికారంలో ఉన్నాం కనుక అర్థంలేని కారణాలు చెప్పి అడ్డుకుంటే వారు పర్యటనలు ఆగిపోతాయి. కొంతమేర విపక్షాల ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవచ్చు. ఇప్పుడంటే అడ్డుకుంటారు. రేపు షెడ్యూల్ రిలీజ్ అయితే.. అధికారాలన్ని ఈసీ చేతికి వెళ్లిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు? ఎలా అడ్డుకుంటారు?

గత ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన జగన్ ప్రతీ శుక్రవారం హైదరాబాద్ వెళ్లి కోర్టుకు హాజరైయ్యేవారు. ఆ తర్వాత మళ్లీ పాదయాత్ర కొనసాగించేవారు. అప్పుడు కూడా సాంకేతిక కారణాలు చెప్పి గత ప్రభుత్వం ఎప్పుడైనా జగన్ ను అడ్డుకుందా? ఒకవేళ అడ్డుకుంటే జగన్ పాదయాత్ర పూర్తి చేసేవారా? వైసీపీకి గతం ఎందుకు గుర్తురాదు? అధికారంలోకి వస్తే గతాన్ని మర్చిపోతే ఎలా? ఈ ప్రశ్నలు ఆంధ్రా రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.

అయినా ఒక నాయకుడిని అధికారపార్టీ అడ్డుకుంటే.. ఆ నాయకుడికి అంతకు మించిన ఇమేజ్ కట్టబెట్టినట్టు అవుతోంది. అనవసరంగా ఈ వ్యూహాన్ని మరచి వైసీపీ ఎందుకు అపఖ్యాతి మూటగట్టుకుంటుందో అర్థం కావడం లేదు. జరగాల్సిన ప్రచారం ఎలాగైనా జరుగుతోంది. కానీ, జగన్ అడ్డుకుంటే ఆ ప్రచారానికి మరింత ఊపు వస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అదే జరుగుతోంది. జగన్ కి పవన్ అంటే భయం.. ఆ భయంతోనే పవన్ పర్యటనలను అడ్డుకుంటున్నారని జనసేన ఊదరగొడుతోంది. దీని వలన పవన్ ఇమేజ్ పెరుగుతోంది తప్ప తగ్గదు. రూపాయి ఖర్చు లేకుండా పవన్ కు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారు వైసీపీ నేతలు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -