Pawan Kalyan: భారత్ క్రికెటర్ కంటే వైసీపీ నేత ముఖ్యమా.. పవన్ కళ్యాణ్ విమర్శలు మామూలుగా లేవుగా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలపై చాలా ఫోకస్ పెట్టారు అవకాశం దొరికితే చాలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనని ఆయన పరిపాలన విధానాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. తాజాగా మరోసారి జగన్మోహన్ రెడ్డి పట్ల పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ఒక క్రికెటర్ కంటే వైకాపా నేత ముఖ్యమా అంటూ ఈయన వైకాపా వ్యవహార శైలి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు జరిగిన గాయాలను సైతం లెక్కచేయకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోసం హనుమ విహారి తన శక్తిని అంతటినీ ధారపోసారు అంటూ పవన్ కళ్యాణ్ అతనిపై ప్రశంసలు కురిపించారు.

ఇలా ఆంధ్రప్రదేశ్ కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి ఆయనను ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా అవమానించిందని తెలిపారు. ఏపీ రంజి జెట్టు నాకౌట్ లో చేరడంలో ఆయనది కీలక పాత్ర అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. కేవలం వైకాపా నేత కారణంగా ఆయన కెప్టెన్సీకి రాజీనామా చేశారు అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వైసీపీ వ్యవహార శైలి పై విమర్శలు చేశారు.

మన ఆంధ్ర టీం క్రికెట్ కెప్టెన్ పట్ల క్రికెట్ అసోసియేషన్ చాలా దారుణంగా అవమానకరంగా వ్యవహరించిందని తెలిపారు. ఇలా ఒక క్రికెటర్ ను అవమానించినప్పుడు ఆడుదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాలకు కోట్లు ఖర్చు చేయడం దేనికి అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలా హనుమ విహారి తరపున పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయనకు మంచి జరగాలని ఆకాంక్షించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -