Pawan Kalyan: పిఠాపురంలో లక్ష మెజారిటీ గ్యారంటీ అంటున్న పవన్ కళ్యాణ్.. పొత్తు దెబ్బకు అన్నీ మారిపోయాయా?

Pawan Kalyan: పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి అక్కడే పడింది. పవన్ ను ఓడించడానికి వైసీపీ పెద్ద ఎత్తున మోహరించింది. జగన్ మండలానికి ఓ నేతను ఇంచార్జిగా నియమించారు. ఎంపీ మిధున్ రెడ్డి, మాజీ మంత్రి కన్నబాబు, ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలా ఒక్కో వర్గాన్ని ఒక్కో నేత చూసుకోనున్నారు. ఇప్పటికే కాపులతో ముద్రగడ పద్మనాభం కాపులతో మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు ద్వారంపూడి చంద్రశేఖర్ కూడా మత్స్యకారులతో భేటీ అయ్యారు. ఇలా వైసీపీ దూకుడు పెంచుతోంది. అంతేకాదు.. స్థానిక అధికారులను కూడా తమకు అనుకూలంగా ఉండేవారిని నియమించుకున్నారు. దీంతో.. పవన్ కూడా అలర్ట్ అయ్యారు. ముందుగానే వైసీపీ ఎత్తులను పవన్ గ్రహించారు.

పిఠాపురంలో పవన్ ఆపరేషన్ ఆకర్స్ మొదలు పెట్టారు. వైసీపీలో అసంతృప్తిగా ఉన్నావారిపై పవన్ ఫోకస్ చేశారు. నిన్న పెద్ద ఎత్తున వైసీపీ నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలో పవన్.. వైసీపీ నేతలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పిఠాపురం నుండి పోటి చేసే అవకాశం రావడం తన అదృష్టమని పవన్ అన్నారు. 2009 నుంచి పిఠాపురంలో పోటీ చేయాలని చాలా మంది కోరుతున్నాని పవన్ చెప్పారు. 2019లో పోటీ కూడా చాలా మంది అడగారు కానీ.. ఆలోచించానని అన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే పిఠాపురం చాలా కీలకమైన ప్రాంతమని చెప్పారు. కాపులు ఇక్కడ పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు. ఈ ఒక్క మాటతో కాపులను పవన్ తన వైపు తిప్పుకున్నారు. ముద్రగడ పాచికలు పారకుండా జాగ్రత్త పడ్డారు. ఈ నియోజకవర్గంలో కాపులు 60 వేల మంది ఉన్నారు. వీరంతా జనసేన వైపు ఉన్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. భీమవరం, గాజువాకతో పాటు.. పిఠాపురం కూడా తనకు చాలా ఇష్టమని చెప్పారు. పిఠాపురాన్ని స్వస్థలంగా చేసుకుంటానని పవన్ చెప్పారు.

పిఠాపురంలో తనను ఓడించే బాధ్యత మిథున్ రెడ్డి తీసుకున్నారని అన్నారు. అయితే.. ఇక్కడే ఓ కీలకమైన మాట కూడా చెప్పారు. మిథున్ రెడ్డిపై తనకు వ్యక్తిగతంగా కోపం లేదని గౌవరం ఉందని అన్నారు. గత కొంతకాలంగా మిథున్ రెడ్డి స్థానికంగా పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఆయనకు అక్కడ అభిమానులు ఉన్నారు. మిథున్ రెడ్డిపై కోపం లేదని చెబుతూ.. ఆయన అభిమానులను ఎమోషనల్ గా కట్టడి చేసే ప్రయత్నం పవవ్ చేస్తున్నారు. వంగాగీత పవన్ పై పోటీ చేస్తున్నారు. ఆమె రాజకీయ భవిష్యత్ పీఆర్పీ నుంచి మొదలైంది. ఆమె వెనుక ఉన్నవారు చిరంజీవి అభిమానులే. అందుకే ఇక్కడ కూడా పవన్ ఓ పాచిక వేశారు. వంగాగీతపై తనకు గౌరవం ఉందని.. ఆమె త్వరలో జనసేనలో చేరాలని కోరుకుంటున్నానని చెప్పారు. దీంతో.. వంగాగీతవైపు ఉన్న పీఆర్పీ అభిమానులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. ఈ కామెంట్స్ తో పిఠాపురంలోని వైసీపీ కార్యకర్తలను గందరగోళానికి గురి చేశారు. వంగా గీత గతంలో పీఆర్పీలో ఉన్నారు. ఇప్పుడు ఆమెకు పవన్ ఆహ్వానించడంతో వైసీపీ కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. ఆమె ఉంటుందా? జనసేనలో చేరిపోతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇలా అడుగడుగునా పవన్ తన చతరతను చూపిస్తున్నారు. దీనికితోడు.. టీడీపీ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ పవన్ కు దొరుకుతుంది. టీడీపీ నుంచి టికెట్ ఆశించిన వర్మ కూడా సైలంట్ అయ్యారు. పవన్ కోసం పని చేస్తానని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. కాబట్టి పిఠాపురంలో పవన్ కు లక్ష మెజారిటీ ఖాయంగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -