Pawan Kalyan: భీమవరం పోటీ విషయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయమిదేనా.. ఆ వ్యూహంతో ముందుకెళ్తారా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి రాబోతున్నారు ఇప్పటికే సీట్లు కేటాయింపు విషయంపై కూడా క్లారిటీ వచ్చింది జనసేనకు 24 ఎమ్మెల్యేలు మూడు ఎంపీ సీట్లను టిడిపి ఇచ్చేశారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం భీమవరం నుంచి పోటీ చేయబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. గతంలో కూడా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు అయితే గతంలో ఓడిపోగా ఈసారి మాత్రం అక్కడే గెలిచి వైసిపికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఈయన భావించారు.

ఇక పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేసి ఎలాగైనా తనని మెజారిటీతో గెలిపించాలని జనసేన కార్యకర్తలు కూడా ఫిక్స్ అయ్యారు. ఇలా ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తారు అనుకున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. ఇటీవల ఈయన భీమవరంలోని లోకల్ నాయకులను కలిసి మాట్లాడారు. అనంతరం టిడిపి నాయకులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

ఇక భీమవరంలో 2009లో పోటీ చేసి గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులతో పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అందుతున్న సమాచారం ప్రకారం భీమవరం నుంచి ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం లేదని ఈయన భీమవరం నుంచి కాకుండా మరి ఇతర స్థానాల నుంచి పోటీకి సిద్ధమయ్యారని తెలుస్తోంది అయితే భీమవరంలో రామాంజనేయులు పోటీ చేయమని పవన్ కళ్యాణ్ కోరినట్లు స్వయంగా రామాంజనేయులు వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడటంతో తాను నాకంటే భీమవరం నుంచి మీరు పోటీ చేస్తేనే బాగుంటుందని మీరు నిలబడితే నా మద్దతు కూడా మీకే ఉంటుందని రామాంజనేయులు చెప్పినట్లు వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ కాకుండా భీమవరంలో ఎవరు నిలబడిన తమ పూర్తి మద్దతు వారికే ఉంటుందని మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. మరి భీమవరం నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారనే విషయాల గురించి మరొక రెండు రోజులలో స్పష్టత రానుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -