Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పరువు తీసిన వైసీపీ మంత్రి.. అలాంటి కామెంట్లతో?

Pawan Kalyan: గుడివాడ అమర్నాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గం ఇన్చార్జిగా పనిచేశాడు. 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గోవింద సత్యనారాయణ పై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టాడు.

ఆ తరువాత 2022 ఏప్రిల్ 11న వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన సచివాలయంలోని తన ఛాంబర్ లో ఏప్రిల్ 21న మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఈయన ముందు నుంచి జగన్ కి నమ్మినబంటుగానే ఉంటూ వచ్చాడు. అందుకే జగన్ కి ప్రధాన శత్రువైన పవన్ కళ్యాణ్ ని ఎండగట్టడంలో ముందుంటాడు అమర్నాథ్. పవన్ కళ్యాణ్ ప్రారంభించిన వారాహి యాత్రపై ముందు నుంచి విమర్శలు గుప్పిస్తున్నాడు అమర్నాథ్. అయితే ఇప్పుడు వారాహి యాత్ర పార్ట్ టు మొదలుకావడమే ఆలస్యం మళ్లీ ఆయనపై సెటైర్లు ప్రారంభించాడు అమర్నాథ్.

 

వారాహి యాత్ర రెండో ఎపిసోడ్ మొదలుపెట్టేముందు పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే వైసీపీ పై హాట్ కామెంట్స్ చేశారు. వీటికి మంత్రి అమర్నాథ్ అదే స్థాయిలో స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు. పవన్ సినిమాల్లో హీరో కానీ రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్ అంటూ మండిపడ్డారు. పవన్ సినిమాలో చంద్రబాబు విలన్ అని మంత్రి విమర్శించారు. జనసేనకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరన్నారు. 2019లో ఎన్నికల ఫలితాలు మరొకసారి పునరావృతం అవుతాయి అంటూ ఎద్దేవా చేశారు. పవన్ భార్యతో విడిపోయారని వార్త రాగానే భార్యతో కలిసి ఉన్న ఫోటో విడుదల చేశారు అలా భుజాలు తడుముకోవలసిన అవసరం ఆయనకు ఏమొచ్చింది.

 

అయినా వారాహి యాత్ర ఎందుకు చేస్తున్నారు.. ఎవరైనా ఎన్నికల్లో విజయం సాధిస్తే విజయ యాత్ర చేస్తారు ఏం సాధించారని పవన్ కళ్యాణ్ విజయాత్ర చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ పరువు తీసేసేలాగా కామెంట్లు చేశారు గుడివాడ అమర్నాథ్. అయితే అందుకు పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒకప్పుడు ఆయనతో ఫోటో తీసుకోవడం కోసం తహతహలాడిన వ్యక్తి ఇప్పుడు ఆయననే విమర్శిస్తున్నారా అంటూ చురకలు అంటిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -