Hyper Aadi: హైపర్ ఆది పై పవన్ కళ్యాణ్ అభిమానులు ఫైర్.. అసలేం జరిగిందంటే?

Hyper Aadi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైపర్ ఆది గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ లో అతి తక్కువ సమయంలో కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఆదినే. అందరూ టైమింగ్ కామెడీని నమ్ముకుంటే ఇతడు పంచింగ్ కామెడీ నమ్ముకుంటాడు. గ్యాప్ లేకుండా స్కిప్ట్ అయిపోయేంత వరకు పంచుల వర్షం కురిపిస్తూ ఉంటాడు.

ఇలా జబర్దస్త్ కమెడియన్లలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఆది. ఇదిలా ఉంటే తాజా గా ఆదిపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే పూనకంతో ఊగిపోయే ఆది.. కొత్తగా పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట నోరు జారాడు. అదేమిటంటే ప్రస్తుతం హైపర్ ఆది ఢీ డాన్స్ షో లో తెగ హడావిడి చేస్తున్నాడు.

ఇక ఈ షో కు కిరణ్ అబ్బవరం పాల్గొని తన సినిమా ప్రమోటింగ్ గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో హైపర్ ఆది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన తెచ్చాడు. పవన్ కళ్యాణ్ మాట వినిపిస్తేనే నాకు తెలియకుండానే నా నోటికి అరుపులు, చేతులకు చప్పట్లు, వేళ్ళకు విజిల్స్ వస్తూ ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకునే హీరో ఎవరైనా ఉంటే అది కిరణ్ అబ్బవరం అని తెలిపాడు.

ఇక ప్రస్తుతం ఆది చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ కామెంట్లు చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు నిన్ను దేనితో కొట్టాలిరా అంటూ కామెంట్లు రూపంలో విరుచుకుపడుతున్నారు. నీ జీవితంలో అతిపెద్ద జోక్ ఏదైనా ఉందంటే అది ఇదే అని కొందరు కొట్టి పారేస్తున్నారు. కొందరు కిరణ్ కి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి అని అంటూ హైపర్ ఆది పై మండపడుతున్నారు. మరి వీటి గురించి హైపర్ ఆది ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Blueberries: ఇవి తింటే మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పని చేస్తుందట.. ఎలా తినాలంటే?

Blueberries: కొన్ని రకాల పండ్లు తినడం వలన అటు ఆరోగ్యానికి, ఇటు మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో బ్లూబెర్రీస్ ముందు వరుసలో ఉంటాయి. బ్లూ బెర్రీస్ లో ముఖ్యంగా...
- Advertisement -
- Advertisement -