Pawan Kalyan: పవన్ పేరిట మాల పుచ్చుకున్న అభిమానులు.. వైరల్ గా మారిన ఫోటో?

Pawan Kalyan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా అభిమానులు వారి అభిమాన హీరోల పట్ల ఉన్న అభిమానం చాటుకోవడం కోసం పెద్ద ఎత్తున వారి పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అలాగే వారి పుట్టినరోజు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేయడం చేస్తుంటారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఇక ఈయన పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో అభిమానులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఈయన పుట్టినరోజు హడావిడి చేస్తున్నారు. సెప్టెంబర్ రెండవ తేదీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలను జరపడానికి సిద్ధమయ్యారు. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇందులో భాగంగా కొందరు అభిమానులు ఎర్ర కండువా పై పవన్ కళ్యాణ్ పేరు రాయించుకుని ఏకంగా మాల తీసుకొని 49 రోజులపాటు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పనులను ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక ఈయన కేవలం సినీనటుగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ఎంతో గుర్తింపు పొందారు.

ఇలా జనసేన పార్టీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సేవలను ప్రజలలోకి తీసుకెళ్లడం కోసం ఈ విధంగా మాల తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 49వ పుట్టినరోజు జరుపుకోవడంతో 49 రోజులపాటు ఈ దీక్ష చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా పవన్ కళ్యాణ్ పేరిట ఏకంగా దీక్ష తీసుకోవడంతో అసలు ఇదే క్రేజీ ఇంతగా ఒక హీరోని అభిమానించే వాళ్లు కూడా ఉంటారా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -