Pawan Kalyan: డిజాస్టర్ సొంతం చేసుకున్న 100 కోట్ల కలెక్షన్లను రాబట్టిన పవన్ సినిమాలివే!

Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు.ఇక ఈయన ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు మూడు దశాబ్దాల పూర్తవుతున్నప్పటికీ ఈయన చేసింది మాత్రం చాలా తక్కువ సినిమాలనే చెప్పాలి.ఇలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఘనత పవన్ కళ్యాణ్ కు మాత్రమే చెందింది.

ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే టాక్ ఉంది. అయితే ఈయన సినిమాలు మినిమం హిట్ అంటేనే భారీ కలెక్షన్లను రాబడతాయి అలాగే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నా కానీ 100 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సినిమాలు ఉన్నాయి.ఇలా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని 100 కోట్లు రాబట్టిన సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే… గోపాల గోపాల హిట్ సినిమా తర్వాత డాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాటమరాయుడు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ డిజాస్టర్ టాక్స్ అందం చేసుకుంది అయితే ఈ సినిమా మొదటి రోజు 50 కోట్లను రాబట్టడమే కాకుండా ఈ సినిమా 89 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

దాదాపు పది సంవత్సరాల నుంచి హిట్ లేఖ సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా పవన్ కళ్యాణ్ ఒక కథను సిద్ధం చేసుకుని సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది అయితే ఈ సినిమా 92 కోట్ల గ్రాస్ రాబట్టింది.

పవన్ కళ్యాణ్ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన జల్సా,అత్తారింటికి దారేది సినిమాలు ఎలాంటి హిట్ అందుకున్నాయో మనకు తెలిసిందే ఈ క్రమంలోని వీరిద్దరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి వచ్చినటువంటి చిత్రం అజ్ఞాతవాసి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్దఅట్టర్ ప్లాప్ అయ్యింది ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా పెద్ద ఎత్తున నెగిటివ్ టాప్ సొంతం చేసుకుంది. ఇలా నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా మొత్తం 95 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.ఇలా పవన్ కళ్యాణ్ డిజాస్టర్ సినిమా సాధించిన కలెక్షన్లు మరొక హీరో హిట్ సినిమా ద్వారా వచ్చే కలెక్షన్లు సమానమైన అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -