Pawan Kalyan: బీజేపీకి పవన్ గుడ్ బై? జనసేనాని షాకింగ్ డెసిషన్?

Pawan Kalyan:  ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. ఇప్పటినుంచే ప్లాన్ లు రూపొందిస్తూ రాజకీయ వేడిని పెంచుతున్నారు. సీఎం జగన్ ను ఎలాగైనా అధికారంలో నుంచి దించాలనే కృతనిశ్చయంతో ఉన్న పవన్.. అందుకు తగ్గట్లు ప్రణాళికలను రూపొందించుుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకునేందుు జనవరి నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఏపీ రాజకీయం ముఖచిత్రం మారబోతోందని చెప్పి పవన్ కల్యాణ్.. దీంతో పాటు రాజకీయంగా పలు కీలక నిర్ణయాలు తీసుకనే అవకాశముంది.

బీజేపీతో పొత్తుకు పవన్ గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల తర్వాత బీజేపీతో పవన్ మళ్లీ కలిశారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో జనసేన ఉంది. కానీ బీజేపీ పవన్ ను అసలు పట్టించుకోవడం లేదు. పవన్ కూడా బీజేపీకి అంటీముంటన్లుగానే ఉంటున్నారు. రెండు పార్టీలు పొత్తులు ఉన్నా.. ఒక్కసారి కూడా కలిసి ఆందోళనలు, నిరసనలు చేసిన దాఖలాలు లేవు. ఉమ్మడి కార్యాచరన రూపొందించుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేసిన ఘటనలు అసలు లేవు. ఇరు పార్టీల నేతలు అసలు కలిసిన ఘటనలు కూడా అసలు లేవు. పేరుకు మా త్రమే పొత్తులో ఉన్నా..జనసేన, బీజేపీ ఎవరికి కార్యక్రమాలు వాళ్లు చేసుకుంటున్నారు. ఎవరి వారు తమ పార్టీలను బలపరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు.

అంతేకాకుండా ఉమ్మడిగా కలిసి పనిచేసేందుకు రూట్ మ్యాప్ ఇవ్వాలంటూ పవన్ కోరినా.. బీజేపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బీజేపీతో పొత్తులు ఉన్నా.. ఎందుకో తమ మధ్య సంబంధాలు సరిగ్గా లేవని, కలిసి కార్యక్రాలు చేయలేకపోయామంటూ ఇటీవల పవన్ చెప్పుకొచ్చారు. మోదీ, అమిత్ షా అంటే తనకు గౌరమవని చెబుతూనే.. వారికి తాను ఊడిగం చేలేనంటూ పవన్ చెప్పుకొచ్చారు. దీంతో త్వరలో బీజేపీతో పవన్ అధికారికంగా కటీఫ్ చెప్పనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీవెళ్లిన పవన్.. కేంద్ర బీజేపీ పెద్దలను కలిశారు. ఏపీలోని రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలు తనను పట్టించుకోవడం లేదని, ఎవరికి వారు యమునాతీరే అన్నట్లుగా వ్యవహరిస్తుననారంట ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నా.. రాష్ట్ర నేతలు కలిసి పనిచేసేందుకు ముందుకు రావడం లేదని చప్పినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర బీజేపీ పెద్దల నుంచి కూడా సరైన సమాధానం రాకపోవడం, టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్దంగా లేకపోవడంతో బీజేపీతో పొత్తుుకు జనసేన గుడ్ బై చెప్పనుందని ప్రచారం జరుగుతోంది. బీజపీ, జనసేన పొత్తు పెట్టుకున్నార తిరుపతి లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో జనసేనను సంప్రదించకుండానే బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపింది. అయినా అక్కడ బీజేపీకి పవన్ మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నికలో పవన్ ను సంప్రదించకుండానే బీజేపీ అభ్యర్ధిని పోటీలోకి దింపింది. దీంతో పవన్ కూడా అక్కడ బీజేపీకి మద్దతు ఇవ్వలేదు. ఏ పార్టీకి మద్దతు ప్రకటించకుండా సైలెంట్ గా ఉండిపోయారు.

ఇక అంతర్వేది రథం దగ్ధం, విజయనగరం జిల్లాలో రామతీర్దం ఘటన విషయాల్లో జనసేనను కలుపుకోకుండా బీజేపీ ఒంటరిగా ఉద్యమాలు చేసింది. దీంతో బీజేపీ తనను పట్టించుకోకపోవడంతో ఆ పార్టీతో త్వరలో ఇక సంబంధాలు తెచ్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారని ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ చేతులు కలిపారని చెబుతున్నారు. దీంతో బీజేపీకి పవన్ ఇక దూరమైనట్లే అని రాజకీయ వర్గాలు భావిస్తుననాయి.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -