Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా ప్రత్యర్ధుల నిర్వాకమే అంటూ అధికార పక్షం ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈయన మరొకసారి మరొక డిమాండ్ తో తెరమీదకి వచ్చారు. విజయవాడలో నిర్వహించిన బస్సు యాత్రలో భాగంగా జగన్ పై రాయి విసరటం, నుదుటి మీదదెబ్బ తగలడం, దీనికి రెండు కుట్లు పడటం అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ పోలీసులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారంటే సీఎం జగన్ పై దాడి ఘటనపై బాధ్యత వహించాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా విచారణ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. డీజీపీ,నిఘా విభాగం అధిపతి, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ పాత్రపై విచారణ చేయవలసిందిగా కోరారు. భద్రతా లోపాలతోనే దాడి జరిగిందన్న వాదనను వినిపిస్తున్న పవన్ కళ్యాణ్ ముందు వారిని బదిలీ చేయడానికి నిజాయితీగల అధికారులతోనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

వీవీఐపీ కేటగిరీలో ముఖ్యమంత్రి జగన్ ఎక్కడికి వెళ్లినా పరదాలు కట్టి చెట్లు కొట్టేసేవారు. అన్ని రోజులు పట్టపగలే బస్సు యాత్ర జరిగింది కానీ ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ నిలిపివేసి బస్సు యాత్ర జరిగింది అంటూ ప్రశ్నించారు. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి మోడీ సభలో కూడా భద్రతాపరమైన లోపాలు తలెత్తయానే విషయాన్ని మరొకసారి గుర్తు చేశారు. మరి జనసేనకు ఎవరి నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -