Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో నటించి అడ్రస్ లేకుండా మాయమైన హీరోయిన్స్?

Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. దాదాపు ఈయన ఇండస్ట్రీలో కొనసాగుతూ మూడు దశాబ్దాలు అయినప్పటికీ చేసింది మాత్రం చాలా తక్కువ సినిమాలనే చెప్పాలి. ఇలా తక్కువ సినిమాలలో నటించినప్పటికీ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా ఉంది.ఇక పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలను నటించగా మరికొన్ని డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ తన సినిమాల ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా ఈయన సినిమాలలో నటించిన కొంతమంది హీరోయిన్లకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ చాలామంది హీరోయిన్లు అడ్రస్ లేకుండా పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. పవన్ కళ్యాణ్ సరసన నటించిన భూమిక, రాశి, శృతిహాసన్, త్రిష వంటి హీరోయిన్లు ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నారు.

ఇకపోతే ఈయన సరసన నటించిన మరికొంతమంది హీరోయిన్లు కేవలం ఈయన సినిమాలకు మాత్రమే పరిమితమై ఇకపై వెండితెరకు పూర్తిగా దూరమైన వారు కూడా ఉన్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ సరసన నటించి ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా పోయిన హీరోయిన్ల జాబితాలో కృతికర్బందా, మీరాజాస్మిన్, ప్రీతి జింగానియా, కీర్తి రెడ్డి, అంజ‌లీ లావానియా, సారా జేన్ డ‌యాస్ వడ్డీ హీరోయిన్లు పూర్తిగా ఇండస్ట్రీకి కనుమరుగయ్యారు.

పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో నటించిన ఈ హీరోయిన్లకు ఆయనలో ఉన్నటువంటి క్రేజ్ పావు వంతు కూడా లభించకపోవడంతో అలాగే ఈ హీరోయిన్లు నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో వీరికి తిరిగి ఇండస్ట్రీలో అవకాశాలు కరువయ్యాయి. దీంతో ఈ ముద్దుగుమ్మలు పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల కన్నా రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈయన పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ అవి మాత్రం ఎప్పుడు పూర్తయితాయో తెలియని పరిస్థితులలో నిర్మాతలు ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -