Pawan Kalyan – YS Jagan: సీబీఐ దత్తపుత్రుడు కాదు.. జగన్‌కు మరో కొత్త పేరు పెట్టిన పవన్!

Pawan Kalyan – YS Jagan: సీఎం వైఎస్ జగన్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో కొత్త పేరు పెట్టారు. గతంలో పవన్ ను చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ జగన్ విమర్శలు చేశారు. పవన్ కు చంద్రబాబు దత్తపుత్రుడు అని పేరు పెట్టారు. దీంతో అప్పట్లో తనను చంద్రబాబు దత్తపుత్రుడు అని జగన్ విమర్శిస్తున్నారని, ఆయన సీబీఐకి దత్తపుత్రుడంటూ జగన్ ను పవన్ విమర్శించారు.

ఈ క్రమంలో తాజగా జగన్ కు పవన్ మరో కొత్త పేరు పెట్టారు. అవెంజర్స్ సినిమాలో తానోస్ పేరును జగన్ కు పెట్టారు. జగన్ ఆంధ్రా తానోస్ అని పవన్ కొత్త పేరు పెట్టారు. వైసీపీ తానోస్ నవరత్నాలు అని చెప్పి ప్రజలను చంపేస్తున్నారని పవన్ ఆరోపించారు. అవెంజర్స్ సినిమాలో తానోస్ అనే విలన్ ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేస్తానని చెప్పి సగం మందిని చంపేస్తాడని, జనాలను చంపి భారం తగ్గిస్తున్నానని అనుకుంటాడన్నాడు. తాను మంచే చేస్తున్నట్లు తానోస్ అనుకుంటాడని పవన్ చెప్పాడు.

జనాలను చంపి తాను విశ్వానికి మంచి చేస్తున్నానని అతడు అనుకుంటాడని పవన్ చెప్పాడు. ఇప్పుడు జగన్ ఆంధ్రా తానోస్ అని పవన్ విమర్శలు చేశారు. జగన్ కు పవన్ పెట్టిన ఈ కొత్త పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్రా తానోస్ జగన్ అంటూ జనసైనికులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. జగన్ పై జనసైనికులు సెటైర్లు పేల్చుతున్నారు.

కాగా ఇటీవల పలు బహిరంగ సభల్లో కూడా చంద్రబాబుకు దత్తపుత్రుడు పవన్ అంటూ జగన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు, పవన్ కలిసి కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. పవన్, చంద్రబాబు ఒక్కటేనని, వారి మాటలు నమ్మవద్దని జగన్ సూచించారు. దీంతో జగన్ మాటలకు పవన్ ఇప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను దత్తపుత్రుడు అయితే నువ్వు ఆంధ్రా తానోస్ అంటూ కొత్త పేరు పెట్టారు. పవన్ పెట్టిన కొత్త పేరు ఇప్పుడు నెట్టింగ్ వైరల్ గా మారింది. తిరుపతిలో జరిగిన జనసన జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్లొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ పాలనపై విరుచుకుపడ్డారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -