Pawan Kalyan: అట్లుంటది పవన్ ఫ్యాన్స్ తో.. జగన్ ముందే జై కళ్యాణ్ బాబు నినాదాలతో హోరెత్తించారా?

Pawan Kalyan: వైయస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఇటీవల బస్సు యాత్రలో భాగంగా జగ్గం పేట నియోజకవర్గం మేమంతా సిద్ధం యాత్రలో జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి చేదు అనుభవమే ఎదురయింది. పవన్ పవర్ ఏంటో జస్ట్ శాంపిల్ చూపించారు అక్కడి ఆదిత్య కాలేజ్ విద్యార్థులు. కనీసం పవన్ కళ్యాణ్ పేరు కూడా పలకడానికి ఇష్టపడని జగన్ ముందు బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ నినాదాలు చేస్తూ రచ్చ చేశారు.

ఈ విధంగా విద్యార్థులందరూ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ పట్ల ప్రశంసలు కురిపిస్తూ నినాదాలు చేయడంతో జగన్మోహన్ రెడ్డి ఆ నినాదాలు వినపడి వినపడినట్టు అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలతో మాట్లాడి వెళ్లిపోయారు ఇలా పూర్తిస్థాయిలో ఫ్రస్టేషన్ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కాకినాడ సభలో పవన్ పై విమర్శలు చేస్తూ తన ఫ్రస్టేషన్ మొత్తం బయటకు పెట్టేశారు.

కాకినాడ సభలో మరోసారి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు ఇలా తన వ్యక్తిగత విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి కాకినాడ సభలో తీవ్రస్థాయిలో విమర్శించారు. పవన్ కళ్యాణ్ కు నలుగురు పెళ్ళాలపై ఏ విధంగా అయితే ప్రేమ లేదు నాలుగు నియోజకవర్గాలపై కూడా అలాగే ప్రేమ ఉండదు అంటూ మరోసారి తన వ్యక్తిగత విమర్శలు చేశారు.

జగన్మోహన్ రెడ్డి ఏ సభకు వెళ్లిన ప్యాకేజి స్టార్ దత్తపుత్రుడు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు అంటూ పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే పవన్ పట్ల జగన్ ఇలా మాట్లాడటంతో పవన్ కళ్యాణ్ కు సానుభూతి పెరుగుతుందే తప్ప ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ అభిమానులు కళ్యాణ్ బాబు కల్ట్ ఏంటో జగన్ కి చూపించారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -