Varahi: విశాఖలో పవన్ కళ్యాణ్ వారాహీ.. పోలీసులు పెట్టిన షరతులు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Varahi: విశాఖలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోయే వారాహి యాత్రకి పర్మిషన్లు ఇచ్చారు కాకపోతే పోలీసులు కొన్ని కండిషన్లు పెట్టారు. ఈ యాత్ర రేపటి నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. యాత్ర అనుమతి కోసం జనసేన నాయకులు పోలీసులను సంప్రదించారు. ఈ మేరకు షరతులతో కూడిన అనుమతి లభించింది. జగదాంబ సెంటర్లో సభకు మాత్రమే అనుమతినిచ్చిన పోలీసులు ర్యాలీలపై నిషేధం విధించారు. వాహన ర్యాలీలు అభివాదం చేయవద్దని స్పష్టం చేశారు.

భవనాలు ఇతర నిర్మాణాలపై కార్యకర్తలు అభిమానులు ఎక్కకుండా చూసే బాధ్యత జనసేన పార్టీ దేనిని పోలీసులు తెలిపారు. ఉల్లంఘనకు పాటుపడితే అనుమతి పొందిన వారిదే బాధ్యత అని నిబంధన విధించారు. అయితే వారాహి యాత్రకు పోలీసులు విధించిన షరతులపై జనసేన పార్టీ నాయకులు షాక్ అవుతున్నారు. రేపటి నుంచి మూడో విడత వారాహి యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో మొదటి రోజే పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకోవాలని అన్నారు. మరొకవైపు జగదాంబ జంక్షన్లో పవన్ సభ నిర్వహించేందుకు జనసేన కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

ముందు రెండు విడతల వారాహి యాత్ర మంచి సక్సెస్ కావడంతో మంచి మూడ్ లో ఉన్న జనసేన కార్యకర్తలు మూడో విడత వారాహి యాత్రను మరింత ఎక్కువ సక్సెస్ చేయాలని మంచి పట్టు మీద ఉన్నారు జనసేనకార్యకర్తలు. ఈ వారాహి యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. అయితే పోలీసులు పెడుతున్న కండిషన్లని చూసి పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవడానికి ప్రభుత్వం పోలీసులని వాడుకుంటుందని జనసైనికులు మండిపడుతున్నారు.

 

పవన్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సంగతి ప్రభుత్వానికి తెలిసిందే. ఎట్టి పరిస్థితులలోని పోలీసులు పెట్టిన కండిషన్లని ఫాలో అవ్వడం జరగని పని ఎందుకంటే జన సముద్రాన్ని అడ్డుకోవడం జనసేన కార్యకర్తల వల్ల కాదు. దీనిని సాకుగా చూపించి ఈ సభని అడ్డుకోవాలని ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసింది అంటున్నారు సైనికులు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చినప్పుడు ఇలాంటి చేష్టలే చేసింది ప్రభుత్వం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -