Pawan Kalyan: డబ్బులు వెనక్కు ఇచ్చేసిన పవన్ కళ్యాణ్.. కానీ?

Pawan Kalyan: ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి విపక్షం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్ల తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అందుకే సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఓ మూవీ అప్‌డేట్ వచ్చింది.

 

ఎన్నో రోజులుగా డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యణ్ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. మైత్రీ మూవీస్ బ్యానర్‌ ఈ సినిమా తీయాలని భావించింది. అయితే ఈ సినిమా కోసం హరీశ్ శంకర్.. పవన్ కళ్యాణ్‌కు కథ చెప్పారట. మైత్రీ మూవీస్ కూడా పవన్‌కు అడ్వాన్స్ ఇచ్చింది. ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. సినిమా పోస్టర్ విడుదలైనప్పటికీ మూవీపై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ క్రమంలో మరో వార్త వైరల్ అవుతోంది.

 

 

అయితే ఈ సినిమాను ఇక్కడే ఆపేస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ‘హరిహర వీరమల్లు’ సినిమా ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను త్వరగా పూర్తి చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది.

 

అందుకోసం మైత్రీ మూవీస్ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ ను కూడా వెనక్కి ఇచ్చేసినట్లు సమాచారం. అయితే సినిమాకు ఓకే చెప్పి చాలా ఏళ్లైంది. ఇన్నేళ్లు అడ్వాన్స్ తీసుకున్న పవన్.. ఇప్పుడు వడ్డీ కూడా చెల్లిస్తాడా? లేదా మైత్రీ మూవీస్ మొహమాటానికి వెళ్లి వదిలేస్తుందో వేచి చూడాలి. అలాగే ఇన్నేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పడంతో ఫ్యాన్స్ కూడా షాక్‌కు గురవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -