Pawan Kalyan: ఏపీ సీఎం జగన్ ను కడిగిపారేసిన పవన్ కళ్యాణ్.. ఏమన్నారంటే?

Pawan Kalyan: జగన్ తనని తాను అర్జునుడిగా పోల్చుకోవటం ఆశ్చర్యంగా ఉందంటూ పవన్ సెటైర్లు వేశారు. అర్జునుడు ఆడపడుచులను రక్షించాడే కానీ ఎప్పుడూ తూలనాడలేదు. సొంత చెల్లి షర్మిలను అత్యంత నీచంగా మాట్లాడుతుంటే ప్రోత్సహించిన వ్యక్తి, తోబుట్టుకి గౌరవం ఇవ్వలేని వ్యక్తి, సొంత చిన్నాన్నను నిర్దాక్షంగా చంపేసిన వాళ్లను వెనకేసుకొచ్చిన వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటున్నాడు అంటూ జగన్ ని ఎద్దేవా చేశారు. ఇది కలియుగం మనం ఎవరిమీ వాళ్లతో పోల్చుకునే అర్హత లేని వాళ్ళము.

 

మీరు జగన్ మీది వైసీపీ, నేను పవన్ నాది జనసేన ఎవరు మంచివాళ్లు ఎవరికి ప్రజలు అండగా ఉండాలి అనేది వాళ్ళకి బాగా తెలుసు, ప్రజలే నిర్ణయిస్తారు అని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. చెల్లెలు షర్మిలను కొందరు నీచంగా తిడుతుంటే అన్నగా వారిని అడ్డుకోవాల్సింది పోయి ఆయనే స్వయంగా ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి మన ఇంట్లో ఆడపడుచులను ఎలా గౌరవిస్తాడు అంటూ ప్రశ్నించారు.

వివేకానంద రెడ్డి కుమార్తె సునీత తనకు రక్షణ లేదు చంపేస్తామని ఫోన్లు వస్తున్నాయని చెబుతున్నారంటే జగన్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.జగన్ బాధ వర్ణనాతీతం. ఆయన్ని అందరూ ఇబ్బంది పెడుతున్నట్లు, ఆయన ఒక అర్జునుడి లాగా మేమంతా కౌరవుల్లాగా తెగ ఫీల్ అవుతున్నారు. ప్రజలే శ్రీకృష్ణుడని మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది అని జగన్ ని ఏకిపారేశారు పవన్ కళ్యాణ్.

 

ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆయన తనయుడు పార్టీలో చేరారు. వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ బాలశౌరి ని జనసేన తరఫున మరోసారి పార్లమెంటులో అడుగు పెట్టాలని ఆకాంక్షించారు. జగన్ ఎన్ని మోసాలు చేసినా,మాయలు చేసినా వాటిని అధికమించి మనం ప్రభుత్వాన్ని స్థాపించాలి అంటూ చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో జనసేన చాలా బలమైన ముద్ర వేస్తుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -