Pawan Kalyan: పవన్ ఎమ్మెల్యే కావడం పక్కా.. మెజార్టీ ఆ రేంజ్ లో ఉండబోతుందా?

Pawan Kalyan:  జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో పూర్తిగా బిజీగా మారిపోయారు ఇప్పటికే కొందరి పేర్లను తెరపైకి తీసుకువచ్చారు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి ఈసారి కూడా పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది. భీమవరం నుంచి పోటీ చేస్తారు అనే విషయం పూర్తిగా ఖరారైందని త్వరలోనే దీనికి సంబంధించి అధికారక ప్రకటన రావడమే ఆలస్యమని తెలుస్తుంది.

గతంలో కూడా భీమవరంలో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఓటమిని ఎదుర్కొన్నారు. కానీ ఈసారి మాత్రం ఈయన గెలుపు ఖాయమని ఎమ్మెల్యేగా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టడం పక్క అంటూ పలు సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి గతంలో వైసిపి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి భీమవరంలో గెలుపొందారు ఈసారి ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా వైసిపి గెలిచే సూచనలులేవని పలు ఇంటర్నల్ సర్వేలు చెబుతున్నాయి.

ఇటీవల భీమవరంలో పర్యటించినప్పుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిత్రపక్షాలైన టీడీపీ, భారతీయ జనతా పార్టీలకు చెందిన నేతల్ని కలిశారు త్వరలోనే మరోసారి ఈయన భీమవరం వెళ్లనున్నట్లు తెలుస్తుంది. భీమవరంలో ఎలాగైనా భారీ మెజారిటీతో గెలుపొందడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ఇక జనసేన టిడిపి రెండు కలిస్తే తమకు ఓటమి ఖాయమని గ్రహించినటువంటి వైసీపీ నేతలు మొదటి నుంచి కూడా జనసేన టిడిపి కలవకూడదని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అవకాశం వైసీపీకి ఇవ్వకుండా ఈసారి ఎన్నికలలో టిడిపి జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -