Pawan Kalyan: ఆ విషయాలలో మారిపోయిన పవన్ కళ్యాణ్.. ఏపీలో గెలుపునకు ఇవే సూచనలంటూ?

Pawan Kalyan: ఎన్నికలు దగ్గర పడేకొద్ది జనసేన అధినేత పవన్ రాజకీయంలో పరిపక్వత కనిపిస్తోంది. లక్ష్యాన్ని ఛేదించడం కోసం నాలుగు అడుగులు వెనక్కి వేసినా పర్వాలేదనే తత్వాన్ని పవన్ బాగా అలవరుచుకున్నారు. అర్జునుడికి చెట్టు, కొమ్మలు, ఆకులు కాకుండా చెట్టుపై ఉన్న పక్షి కనిపిస్తుంది. అలాగే.. పవన్ కు ఇప్పుడు ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందులను లెక్క చేయకుండా కేవలం ఆయన లక్ష్యం దిశగానే ముందుకు వెళ్తున్నారు. ఈసారి తనతో పాటు కనీసం 10 మంది జనసేన నేతలను అసెంబ్లీకి తీసుకొని వెళ్లాలని పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అది కూడా అధికార పార్టీగానే అసెంబ్లీలో అడుగుపెట్టాలని వ్యూహాత్మంగా ముందుకు పోతున్నారు. దానికి కోసం చాలా పరిపక్వతతో కూడిన రాజకీయం చేస్తున్నారు.

సీట్ల సర్ధుబాటులో, టికెట్ల కేటాయింపులో కూటమిలో బీటలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. దీని వలన తన పార్టీలో చిన్నా, చితక అసంతృప్తి కనిపించినా.. బుజ్జగింపులుతో సరిదిద్దుతున్నారు. కానీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా తనదైన రాజకీయం చేస్తున్నారు. దీర్ఘకాలికంగా పార్టీకి బలమైన పునాదులు వేయాలనే వ్యూహం పవన్ లో కనిపిస్తుంది. అందుకే ఆయన రెండేళ్లుగా తనదైన జనసేనానిలో కొత్త నాయకుడు కనిపిస్తున్నారు. మొదట భీమవరం నుంచి పోటీ చేస్తారనే ఆలోచన వచ్చినపుడు కూటమికి చెందిన స్థానిక నాయకులను కలిసి తనకు మద్దతివ్వాలని కోరారు. పిఠాపురం నుంచి ఫోటీ ఫైనల్ అయినపుడు అక్కడ మొదట టీడీపీ నేత వర్మను కలిసి తన మద్దతును కోరారు. తన స్థాయిని పక్కన పెట్టి ఆయన దగ్గరకు వెళ్లారు. వారాహి యాత్ర ప్రారంభానికి ముందు పవన్.. వర్మ ఇంటికి వెళ్లారు. మొదటి రోజు తన యాత్రలో పవన్ పక్కనే వర్మ ఉన్నారు. దీంతో.. టీడీపీ సపోర్టు వందకు వంద శాతం తనకే ఉందనే మెసెజ్ ఓటర్లకు పంపించారు.

కూటమి నేతలకు కలుపుకొని పోతూనే.. ఓటర్లను కూడా తనదైన శైలిలో ఆకర్షించారు. ఒకప్పుడు ఊడిపోతూ ప్రసంగాలు చేసిన పవన్.. సూటిగా అధికార పార్టీ తప్పులను ప్రజల ముందు పెట్టారు. విపక్షాన్ని ప్రశ్నించడమే కాకుండా గెలిస్తే ప్రజలకు ఏం చేస్తానో క్లియర్ గా చెప్పారు. మరోవైపు పిఠాపురంలో ఉన్న సమస్యలను ప్రస్తావించారు. పిఠాపురానికి ఉన్న ఆధ్యాత్మిక చరిత్రను ప్రస్తావించారు. దీంతో.. పవన్ కు పిఠాపురంపై ఎంత అవగాహన ఉందో చెప్పకనే చెప్పారు.

ఈ ఆధ్యాత్మిక ప్రదేశాన్ని వైసీపీ దందాలకు, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ నేతలు డాన్లులా మారి కాకినాడ పోర్టు నుంచి అక్రమ బియ్యం రవాణా, డీజిల్ వంటివాటిని సరఫరా చేస్తున్నారని చెప్పారు. 2024లో ఇలాంటి నాయకులను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్దమని చెబుతున్న జగన్ పేదవాడా? పెత్తందారుడా మీరే ఆలోచించాలని ప్రజలకు చెప్పారు. కరోనా టైంలో ఓ మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ ను ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇలాంటి నాయకుడు పేదల తరఫున పోరాటం చేస్తాడంటే నమ్ముతారా? అని ప్రశ్నించారు.

పిఠాపురం పరిదిలో ఉన్న 54 గ్రామాల ప్రజలు కుల, మతాలకు అతీతంగా తనను ఆశీర్వదించాలని కోరారు. పవన్ ప్రసంగాన్ని చూసిన వారంతా.. జనసేనానియేనా.. ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకునేలా చేశారు. ఆవేశపూరిత ప్రసంగాలకు కేరాఫ్ అడ్డాగా ఉండే పవన్ ప్రజలను ఆలోచింపజేసేలా మాట్లాడారు. ఇలాగే పవన్ తన పర్యటన కొనసాగిస్తే.. జనసేన పోటీ చేస్తున్న వాటిలో మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం ఖాయమని విశ్లేషణలు వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -