Pawan Kalyan: వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొంటున్నాడు. జనసేన పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో అధికార పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ మీద రకరకాలుగా విమర్శలు చేస్తూ ఆయన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఆ విమర్శలకు దీటుగా కౌంటర్లు ఇస్తున్నాడు.

 

ఈ క్రమంలో తాజాగా ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ నాయకులలో మంటలు రేపాయి. ఈ మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..” గతంలో ప్రజలకు సేవ చేయటానికి రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ నాయకులు పాటుపడే వారిని, కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు అన్ని కూడా కుట్రలు కుతంత్రాలతో ఉన్నాయని తెలిపాడు.

 

అంతే కాకుండా అభిమానం ఉన్నంత మాత్రాన అధికారం రాదని ఓట్లు వేస్తేనే సీఎం పదవి దక్కుతుందని తప్పుకొచ్చాడు. ఎన్టీ రామారావు గారు అభిమానం వల్ల అధికారంలోకి వచ్చాడేమో కానీ నా విషయంలో మాత్రం అభిమానం ఉంటే సరిపోదు ఓట్లు వేస్తేనే అధికారంలోకి రాగలను అని తెలిపాడు. అలాగే రాజకీయాలలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నిర్మాణాత్మకమైన రాజకీయం, మరొకటి కక్ష్యపూరిత రాజకీయం.

 

నేనెప్పుడూ ఒక్కో ఇటుక పేరుస్తు నిర్మించుకుంటాను అని తెలిపాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటు పడుతున్న తనని కొందరు శత్రువులుగా భావిస్తున్నారని, అలా శత్రువుగా ఉండటం తనకి ఇష్టమేనని తెలిపాడు. నన్ను భయపెట్టటానికి ఎన్ని మాటలు అన్నా కూడా నేను అంతకంతకు రాటు తేలుతాను.. నన్ను మెత్తగా ఉంచుతారా లేక మా తెనాలి వెంకటేశ్వర రావు దగ్గర నుండి చెప్పులు తెచ్చి చుపించేలా చేస్తారో మీ చేతుల్లో ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -