Pawan Kalyan: దొంగ ఓట్లపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Pawan Kalyan: తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. సీఈసీ రాజీవ్‌కుమార్‌ను కలిసి రాష్ట్రంలో ఓటరు జాబితాలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం నేతలిద్దరూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చిందని, అందుకే నకిలీ ఓట్లు చేర్చేందుకు ఆ పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

 

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఎప్పుడూ లేనివిధంగా అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశాము. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారు. తెదేపా, జనసేన నేతలపై సుమారు 6-7వేల కేసులు పెట్టారు. పుంగనూరు కేసులో 200 మందికి పైగా జైలుకు వెళ్లి వచ్చారు. ఎన్నికల్లో ఎవరినీ పనిచేయకుండా చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారు. వైసీపీ అరాచకాలను సీఈసీకి వివరించాము. ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు అని చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు.

అలాగే ఎన్నికల విధులకు అనుభవం ఉన్న సిబ్బందిని నియమించాలి. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను విధుల్లో ఉంచుతారా? బీఎల్‌వోలుగా 2,600 మంది మహిళా పోలీసులను నియమించారు. అవసరమైతే కేంద్ర పోలీసు పరిశీలకులను రాష్ట్రానికి పంపాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నాలన్నీ చేస్తాం. ఒక్క దొంగ ఓటు ఉన్నా ఈసీ దృష్టికి తీసుకెళ్లేలా పనిచేస్తాం అని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు జనసేన అధినేత పవన్‌ తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు లక్షకు పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెరిగిపోయాయని అన్నారు బాబు..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -