Hari Hara Veeramallu: ఇంకెన్నేళ్లు కావాలి పవన్.. హరిహర వీరమల్లును ఎప్పుడు పూర్తి చేస్తావంటూ?

Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు ప్రారంభోత్సవం జరిగి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. అయితే ఇప్పటివరకు విడుదల తేదీ ఎప్పుడో ఖరారుగా చెప్పలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ కెరియర్ లో అత్యధిక భారీ బడ్జెట్లో రూపొందించిన సినిమాగా షూటింగ్ మొదలైంది. సినిమా మొదలైన కొత్తలో సినిమాకి చాలా హైప్ వచ్చింది. పవన్ పుట్టినరోజుకి టీజర్ రిలీజ్ చేయడంతో సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోయాయి.

 

ఇంతలో కరోనా మహమ్మారి రావటం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ అయిపోవడం ఇంకా ఇతర కారణాల వలన సినిమా పూర్తవ్వకుండా కాలయాపన చేస్తూ వస్తుంది. 2024లో ఈ సినిమా ఎలాగూ విడుదల అయ్యే పరిస్థితిలో కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ తన మొదటి ప్రాధాన్యత ఓ జి కే ఇస్తున్నట్లు సమాచారం. తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ లైన్ లో ఉంది.

ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యేసరికి 2025 వచ్చేస్తుంది. వీరమల్లు దర్శకుడు వచ్చేనెల కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఎందుకంటే పవన్ మళ్ళీ ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కాబట్టి సమయం వృధా కాకుండా ఒక ఫిమేల్ ఓరియంటెడ్ కధను రెడీ చేసుకున్నాడంట క్రిష్. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే హరిహర వీరమల్లు 2026 లో మాత్రమే రిలీజ్ అయ్యే పరిస్థితిలు కనిపిస్తున్నాయి అంటే అప్పటికి ఆరేళ్లు పూర్తి చేసుకుంటుంది.

 

ఇంత సుదీర్ఘకాలం సెట్స్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా ఇదొక్కటే అవుతుంది. అయితే ఏ ఎమ్ రత్నం మాత్రం ఎన్నికలు పూర్తవ్వగానే ఈ సినిమా ముందుకెళ్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఆస్కార్ విజేత కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -