Pawan OG: పవన్ ఓజీ మూవీని అలా ప్లాన్ చేశారా.. ఏమైందంటే?

Pawan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో OG సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు సమాచారం.

పవన్ కళ్యాణ్ ఈ ఏడాది డిసెంబర్ కల్లా అన్ని సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని రాజకీయ పనులలో బిజీ కావాలన్న ఉద్దేశంతో వరుస సినిమా షూటింగులలో పాల్గొంటున్నారు.ఇకపోతే తాజాగా పవన్ సుజిత్ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో సందడి చేయబోతున్నారని తెలుస్తుంది.

 

పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో మనకు తెలిసిందే ముఖ్యంగా బద్రి సినిమాలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హైలైట్ అయ్యాయి.ఇందులో నందా పాత్రలో ప్రకాష్ రాజ్ అద్భుతంగా నటించారు అలాగే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ చిత్రంలో కూడా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మధ్య వచ్చిన సన్నివేశాలు అద్భుతం అనిపించాయి.

 

ఇకపోతే తాజాగా దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది.ఇలా ఈ సినిమాలో మరోసారి ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని తెలియడంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని ఇందులో కూడా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు తప్పకుండా హైలెట్ అవుతాయి అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఇలా OG సినిమాని సుజిత్ భారీగానే ప్లాన్ చేయబోతున్నారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -