Pawan: పవన్ పంచ్ డైలాగులు భలే ఉన్నాయిగా.. జగన్ ఏమంటారో?

Pawan: వారాహి విజయ యాత్రలో భాగంగా భీమవరంలోని బహిరంగ సభలో సీఎం జగన్ మీద రెచ్చిపోయారు పవన్ కళ్యాణ్. మొదటిసారిగా ఆయన పర్సనల్ విషయాలు గురించి ప్రస్తావిస్తూ ఓ రేంజ్ లో జగన్ దుమ్ము దులిపేశారు. వైసీపీ ఫ్యాక్షనిజాన్ని రౌడీయిజాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు.

 

వైసీపీ ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ తో రాజకీయాలలోకి వస్తే, నేను విప్లవ భావాలతో రాజకీయాలలోకి వచ్చానని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో గంజాయి రాష్ట్ర పంటగా గొడ్డలి రాష్ట్ర ఆయుధంగా మార్చేశారని ఆవేశపడ్డారు పవన్.ప్రభుత్వాన్ని ఎదిరించిన వారిపై అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యాలు చేస్తున్నారు.

 

అలాంటి వాడికి భయపడే వ్యక్తిని కాదు నేను. నిండా మునిగిన వాడికి చలేంటి అంటూ ప్రశ్నించారు. జగన్ వస్తుంటే చెట్లను కూడా కొట్టేస్తున్నారు అవి కూడా జగన్ పాలనలో మౌన పోరాటం చేస్తున్నాయి అని ఎద్దేవా చేశారు పవన్. నేను ప్రభుత్వ పాలసీలపై మాట్లాడుతుంటే నాపై వ్యక్తిగతంగా చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.

నీ వ్యక్తిగతం జీవితం గురించి లోతైన విషయాలు నాకు చాలా తెలుసు మీది, మీ మంత్రుల చిట్టా మొత్తం విప్పితే జగన్ చెవుల్లోంచి రక్తం కారుతుంది. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. వైకాపా నేతల నోటికి సైలెన్సర్లు బిగించుకోండి అని హెచ్చరించారు పవన్ కళ్యాణ్.

 

చిన్న వయసులోనే తాత ప్రోత్సాహంతో ఎస్సై ప్రకాష్ బాబుని స్టేషన్లో పెట్టి కొట్టిన వ్యక్తి జగన్. పోలీసు వ్యవస్థపై గౌరవం లేని వ్యక్తి ఇప్పుడు మనకి సీఎం అంటూ ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణం రాజుని పోలీసులతో కొట్టించిన జగన్ ఈ నాలుగేళ్లలో ఏం సాధించారు అంటూ సూటిగా ప్రశ్నించారు పవన్. ఏదేమైనా ఈసారి జగన్ ని ఎండగట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు పవన్.

 

వైకాపా వారి మద్దతుదారులు మాటిమాటికి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడటం తోనే రెచ్చిపోయిన పవన్ ఈ విధంగా మాట్లాడుతున్నారు మొత్తానికి పవన్ పంచ్ డైలాగ్ లు భలే ఉన్నాయి మరి దీనికి జగన్ ఏ విధంగా సమాధానం చెప్తారో అని చెవులు కొరుక్కుంటున్నారు రాజకీయ వర్గాలవారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -