Ustad: ఉస్తాద్ మూవీతో జగన్ కు చుక్కలు చూపించబోతున్న పవన్.. ఆ సీన్లు ఉండబోతున్నాయా?

Ustad: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ ని తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇంకా పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇంకా ఆ మూడు సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే.. అందులో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి. అయితే పవర్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకు ఎప్పుడైతే పచ్చ జెండా ఊపారో అప్పటి నుంచి రకరకాల గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైంది.

మూవీలో పవర్ ఫుల్ పొలిటికల్ పంచ్ లు ఎలాగూ వుంటాయి. ఆ విషయం చెప్పడానికి పెద్దగా జోస్యం రానక్కరలేదు. అలాగే పవన్ హీరో కనుక, జనసేన అధిపతి కనుక పొలిటికల్ టచ్ డైలాగులు వుంటాయి. అది కూడా పెద్దగా ఊహాతీతం కాదు. అయితే ఉస్తాద్ అయితే తెరి సినిమా రీమేక్. ఫక్తు కమర్షియల్ కథ. గతంలో ఈ సినిమాను మైత్రీ సంస్థ పవన్ తోనే రీమేక్ చేసేందుకు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో వర్క్ చేయించింది. చాలా నెలలు సంతోష్ శ్రీనివాస్ వర్క్ చేసి, పకడ్బందీ స్క్రిప్ట్ తయారు చేసారు. అప్పట్లో ఈ ప్రాజెక్టు ఆగిపోవడంతో, సంతోష్ శ్రీనివాస్ కు కొంత రెమ్యూనిరేషన్ ఇచ్చి, స్క్రిప్ట్ తీసుకుని పంపేసారు.

 

ఇప్పుడు అదే స్క్రిప్ట్, కాస్త మార్పు చేర్పులతో ఉస్తాద్ భగత్ సింగ్ గా వస్తోందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు దర్శకుడు హరీష్ శంకర్ కనుక సంతోష్ శ్రీనివాస్ స్క్రిప్ట్ ను తన స్టయిల్ కు అనుగుణంగా మార్చుకునే పని ఎలాగో ఉంటుంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆంధ్రదేశంలో గత నాలుగేళ్లలో జరిగిన కొన్ని సంఘటనలు సినిమా స్క్రిప్ట్ లో భాగంగా కలపడానికి అవకాశం ఉంటుందా అన్నది డిస్కషన్ లో వుందని తెలుస్తోంది. ఎగ్జాంపుల్ విశాఖలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల ప్రదర్శనకు అప్పట్లో పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అలాగే మరి కొన్ని కీలక సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటివి ఏ విధంగా యాడ్ చేసి, ప్రొజెక్ట్ చేయాలనే డిస్కషన్లు సాగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఎంత వరకు నిజమో సినిమా రావాలి లేదా షూటింగ్ మొదలు కావాలి. అప్పుడు ఎలాగూ పక్కాగా తెలుస్తుంది. అంత వరకు ఇలా రకరకాల వార్తలు అయితే వినిపిస్తూ వుంటాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -