PawanKalyan: సినిమాల్లో సక్సెస్ అయ్యా.. కానీ రాజకీయాల్లో ఫెయిలయ్యా!

PawanKalyan: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ అయినప్పటికీ.. రాజకీయాల్లో ఫెయిల్ అయ్యానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్‌లో చార్టెడ్ అకౌంటెంట్స్ విద్యార్థులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యాడు. సీఏ విద్యార్థులతో ప్రసంగించాలని కాలేజీ యాజమాన్యం ఆహ్వానం పంపారు. ఈ క్రమంలో శిల్పకళా వేదికలో సీఏ విద్యార్థులకు స్ఫూర్తిదాయక ప్రసంగం ఇచ్చారు. జీవితంలో ఎదురయ్య కష్టాలు, ఓటముల గురించి వివరిస్తున్న తరుణంలో తాను రాజకీయాల్లో ఫెయిల్ అయినట్లు చెప్పుకొచ్చారు. అప్పుడు విద్యార్థులందరూ ‘సీఎం పవర్ స్టార్’ అంటూ నినాదాలు చేశారు.

 

2019 ఎన్నికల్లో తాను ఫెయిల్ అయ్యానని, కానీ ఓడిపోలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఫెయిల్ అయినప్పటికీ.. ఓడిపోలేదని పేర్కొన్నారు. అందుకే ఇంకా పట్టు వదలకుండా గెలుపు కోసం ప్రయత్నిస్తున్నానని అన్నారు. సినిమాల్లో హీరోగా రావాలని ఎప్పుడూ కోరుకోలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ తన మొదటి సినిమా ఫ్లాప్ అయిందనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. తానెప్పుడూ నిరుత్సాహపడలేదన్నారు. దాదాపు ఆరేళ్లపాటు అపజయాలనే చవి చూశానన్నారు. ‘గబ్బర్ సింగ్’ సినిమా తర్వాతే తనకు విజయం దక్కిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జీవితంలో విజయాలు, అపజయాలు సర్వసాధారణమని ఆయన పేర్కొన్నారు.

 

పట్టు విడువని విక్రమార్కుడిలా ప్రతిఒక్కరూ శ్రమించాలని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. తాము ఊహించే ఉద్యోగం దొరక్కపోవచ్చు. వచ్చిన అవకాశాన్నే అందిపుచ్చుకుని జీవితంలో ముందుకు సాగాలన్నారు. అపజయం ఎదురైనా.. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దన్నారు. సమాజంలో మార్పు తెస్తామని కొంతమంది రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచి.. ఆ తర్వాత ఏమీ పట్టనట్లుగా కూర్చుంటారని పేర్కొన్నారు. తాను అలాంటి వాడిని కాదని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో అడుగు పెట్టానని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను విఫల రాజకీయ నాయకుడనే విషయాన్ని పవన్ స్వయంగా అంగీకరించారు. అందుకు తాను బాధపడబోనని పవన్ చెప్పారు. ఓటమి నేర్పిన పాఠాలే భవిష్యత్‌లో విజయానికి పునాదులు వేస్తాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఏ రాజకీయ నాయకుడు చెప్పుకోని మాటలు పవన్ చెప్పారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -