Renu Desai: పవన్ భార్య రేణు దేశాయ్ కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

Renu Desai: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో 4 పైగా సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్నాడు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ పై వైసీపీ వాళ్లు విమర్శలు గుప్పించిన ప్రతి సారి కూడా మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. పదేపదే మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ మూడు పెళ్లిళ్ల విషయంలో పవన్ కళ్యాణ్ పై విమర్శలను గుప్పిస్తూ ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల బాలయ్య బాబు షోలో అదే విషయం గురించి స్పందిస్తూ అందరూ మూడు పెళ్లిళ్లు అంటున్నారు నేను ముగ్గురిని కలిపి ఒకేసారి పెళ్లి చేసుకోలేదు. ఒకరికి విడాకులు ఇచ్చిన తర్వాతే మరొకరిని పెళ్లి చేసుకున్నాను అని తెలిపాడు.

 

పవన్ కళ్యాణ్ వాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ ఇకపై నీ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకువచ్చే వారు కుక్కలే అంటూ కాస్త ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ బాలయ్య బాబు షోలో మాట్లాడిన వీడియోకి గతంలో రేణు దేశాయ్ మాట్లాడిన వీడియోకి అటాచ్ చేస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇక ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకోలేదు ఒకరికి విడాకులు ఇచ్చిన తర్వాత మరొకటి పెళ్లి చేసుకున్నాను అని చెప్పగా తర్వాత రేణు దేశాయ్ మాట్లాడుతూ పెళ్లయిన 11 సంవత్సరాల తర్వాత మీకు తెలియకుండా ఒక అమ్మాయితో ఒక బిడ్డను కని ఉంటే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది అని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -