Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డికి ఈ ఇద్దరు మొగుళ్లే.. భారీ సెగ వల్ల ఓటమి పాలయ్యే ఛాన్స్ ఉందా?

Peddireddy Ramachandra Reddy: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తనకు గట్టి ప్రత్యర్థిలేరని ఇనాళ్ల భావించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో పెద్ద షాక్ తగిలింది. బీజేపీ ఆయన్ని రాజాంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దించింది.

కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తన గేమ్ మొదలు పెట్టారు. అయితే.. కిరణ్ కుమార్ రెడ్డికి, పెద్దిరెడ్డి కుటుంబాలకు ఇవాళ కొత్తగా వచ్చిన వైరం కాదు. దశాబ్దాలుగా ఈ వైరం ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డితో కిరణ్ కుమార్ రెడ్డి ఓ అటాడుకున్నారు. చిత్తూరు జిల్లాలో నల్లారి, పెద్దిరెడ్డి ఫ్యామిలీల మధ్య ఉన్న ఆధిపత్యపోరు అప్పట్లో స్పష్టంగా బహిర్గతమైంది .. సీఎంగా రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ .. జై సమైఖ్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగినా బోణి కొట్టలేక పోయారు. దాంతో చాలా కాలం పొలిటికల్ స్క్రీన్‌పై ఫేడ్‌ఔట్ అయ్యారు. అలాంటి సీనియర్ ఇప్పుడు బీజేపీ అభ్యర్ధిగా రాజంపేట లోక్‌సభ సెగ్మెంట్లో పోటీకి దిగారు. వైసీపీ మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేసుకునే కిరణ్ రాజంపేట స్థానాన్ని ఏరికోరి సెలెక్ట్ చేసుకున్నారంట. కిరణ్‌కుమార్‌ రెడ్డి.. తన, తన ప్రత్యర్థి బలాబలాలను అంచనా వేసుకొనే రాజంపేటను సెలక్ట్ చేసుకున్నారు.

వైఎస్‌కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. అందుకే వైఎస్ హయాంలో చీఫ్‌ విప్‌గా, స్పీకర్‌గా పనిచేశారు. నియోజకవర్గాల పున్వర్విభజన కమిటిలో కీలకంగా వ్యవహారించి టీడీపీ బలమైన సీట్లను కకావికలం చేయడంలో కీరోల్ పోషించారు. ఆ పునర్విభజనలో ఏర్పడ్డ పీలేరు నల్లారి కుటుంబానికి సొంత నియోజకవర్గం అయింది.. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో కిరణ్ సొంత పార్టీ జైసమైఖ్యాంధ్ర రాష్ట్రవ్యాప్తంగా డిపాజిట్లు కోల్పోయినా .. పీలేరులో పోటీ చేసిన కిరణ్ తమ్ముడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి 56 వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారంటే అక్కడ నల్లారి ఫ్యామిలీకి ఎంత పట్టు ఉందో అర్ధమవుతుంది. అంతేకాదు.. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జిల్లాలో పెద్దిరెడ్డి ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేశారనే టాక్ ఉంది. అందులో భాగంగానే పెద్దిరెడ్డికి కిరణ్‌ తన కేబినెట్ బెర్త్ లేకుండా చేశారట. వైఎస్, రోశయ్య సీఎంగా ఉన్న టైంలో పెద్ది రెడ్డికి కీలక మంత్రిత్వ శాఖలు అప్పగించారు. కానీ, కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఆయన్ని క్యాబినెట్ లోకి తీసుకోలేదు. అంటే పెద్దిరెడ్డితో కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న వైరం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

గత ఎన్నికల్లో పీలేరు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కిషోర్‌కుమార్‌రెడ్డి నాలుగు శాతం ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఈసారి ఆయన ఈజీగా గెలుస్తారని ప్రచారం జరుగుతోంది. పీలేరు కూడా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. ప్రస్తుతం పీలేరు వైసీపీ ఎమ్మెల్యే , పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు చింతల రామచంద్రారెడ్డిని ఈ సారి ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న పట్టుదలతో ఉన్నారు కిషోర్‌రెడ్డి.

రాష్ట్రంలో పొత్తుల లెక్కలు తేలే వరకు బీజేపీలో పెద్దగా యాక్టివ్ రోల్ పోషించని మాజీ సీఎం… పొత్తులు ఓకే అవ్వగానే చక్రం తిప్పారు .. టీడీపీ, జనసేనలతో బీజేపీ పొత్తు ఓకే అయ్యాక … రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్నట్లు సన్నిహితులకు సమాచారం ఇచ్చారు. పదేళ్ల క్రితం వరకు నల్లారి కిరణ్‌రెడ్డి జిల్లాలో పెద్దిరెడ్డి వర్గంపై పైచేయి సాధిస్తూ వచ్చారు. జిల్లా కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడిగా చెలామణి అయ్యారు. మళ్లీ ఇప్పుడు ఆయన యాక్టివ్ అవ్వడంతో టీడీపీ, వైసీపీలో చేరిపోయి ఆయన క్యాడర్ ను ఇప్పుడు తన గూటికి చేర్చుకుంటున్నారు. రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో మైనార్టీ, బలిజ ఓట్లరు కీలకంగా ఉంటారు… బీజేపీతో పొత్తుపై క్లారిటీ లేనప్పుడు టీడీపీ బలిజ సామాజిక వర్గానికి చెందిన గంటా నరహారిని అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు కూమారుడు సుగవాసి సుబ్రమణ్యంను ఖరారు చేసింది. అయితే చివరికి కిరణ్ ఉమ్మడి అభ్యర్ధిగా ఖరారయ్యారు.. టీడీపీ ఆశావహులు కూడా కిరణ్ అయితే ఓకే అంటున్నారంట.

పెద్దిరెడ్డిని కంట్రోల్ చేయాలంటే కిరణ్ కుమార్ రెడ్డిని తెరపైకి రావాల్సిందనే ఉద్దేశంతోనే చంద్రబాబు రాజంపేట సీటును బీజేపీకి ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలతో పెద్దిరెడ్డి అనుచరుల దూకుడుకు కళ్లెం పడుతుందని .. ఆ విధంగా పెద్దిరెడ్డిని రాజంపేటకు పరిమితం చేసి .. ఆయన మిగిలిన సెగ్మెంట్ల వైపు రాకుండా కట్టడి చేయడానికి కిరణ్ రెడ్డి ఉపయోగపడతారని టీడీపీ పెద్దలు భావిస్తున్నారంట. కిరణ్ కుమార్ రెడ్డికి తోడు.. చిత్తూరు జిల్లాలో యాదవ సామాజికవర్గానికి చెందిన బోడే రామచంద్రయాదవ్ కూడా పెద్దిరెడ్డి పతనం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో.. యాదవ్ ల హక్కుల కోసం గత కొంతకాలంగా పోరాటం చేస్తున్న రామచంద్రయాదవ్ కు కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా భారత చైతన్య యువజన పార్టీ అని ఇటీవల ఓపార్టీ స్థాపించారు. అయితే, ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి యాదవ్ ఓట్లను షిప్ట్ అయ్యేలా పావులు కదుపుతున్నారని టాక్ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -