YSRCP Politics: వైసీపీని ముంచేస్తున్న వర్గ రాజకీయాలు.. వైసీపీ పెద్దల మాటలు కూడా చెల్లట్లేదుగా!

YSRCP Politics: వచ్చే ఎన్నికలలో 175 స్థానాలలో గెలుపొందాలి అనే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు కానీ సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున వర్గ రాజకీయాలు మొదలయ్యాయి. దీంతో వైసిపి పార్టీకి పెద్ద నష్టం వాటిల్లేలా ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో రాజకీయ వర్గ పోరు పెద్ద ఎత్తున కొనసాగుతుంది.ఈ వర్గ పోరు తగ్గించడం కోసం సాక్షాత్తు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయసాయిరెడ్డి వంటి వారు రంగంలోకి దిగిన ఎవరు వీరి మాట వినడం లేదని తెలుస్తుంది.

సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజీవయ్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలపై పెత్తనం చాలా ఇస్తున్నారు. అయితే ఈయన గత ఎన్నికలలో సుమారు 61 వేల కోట్ల మెజారిటీతో గెలుపొందారు దీంతో ఈసారి ఎన్నికలలో కూడా ఈయనే అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు దీంతో వర్గ పోరు మొదలైంది.

ఈయన సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించి అందరి జీవితాలతో ఆడుకోవడంతో ఈయనకు పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడింది. ఈసారి ఎన్నికలలో కూడా ఈయనని నిలబెడితే తప్పకుండా ఓటమి ఎదుర్కోవాల్సి వస్తుందని తనని ఓడిస్తామని అక్కడ కార్యకర్తలు చెబుతున్నారు.

ఇక ఈ విషయం గురించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే విజయసాయిరెడ్డి అక్కడ వారితో మాట్లాడే ప్రయత్నాలు చేసిన ఆ ప్రయత్నాలు మాత్రం సఫలం కాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి వెంటనే అభ్యర్థిని మార్చడం తప్ప మరో దారి లేదని అలా కాకుండా ఈయననే కనుక నియమిస్తే వైసిపి ఒక సీట్ కోల్పోవాల్సి వస్తుందని తెలుస్తుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో తన నిర్ణయం మార్చుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -