TDP – YSRCP: టీడీపీ నేతలకు ప్రలోభాలతో ఆశ పెడుతున్న వైసీపీ.. ఇంతలా దిగజారుతోందా?

TDP – YSRCP: ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పెద్ద ఎత్తున వైసిపి పార్టీ నుంచి టిడిపి పార్టీ చెంతకు చేరుతున్నారు నాయకులు కార్యకర్తలు. ఇప్పటికే ఎంతోమంది తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక సూళ్లూరుపేటలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పాలి. పెద్ద ఎత్తున టిడిపిలోకి వలసలు వెళుతుండడంతో జగన్ ఆదేశాలు మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ వారితో మంతనాలు జరిపిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది.

నాయుడుపేట పురపాలక వైస్ చైర్మన్ షేక్ రఫీ, వైకాపా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెంకట రమణారెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సురేఖ రెడ్డి తదితరులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. వీరి బాటలోనే నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామానికి చెందిన వైకాపా బీసీ సెల్ అధ్యక్షుడు దుప్పల రవీంద్రారెడ్డితో పాటు ఆయన భార్య కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.

ఈ విధంగా మీరందరూ తమ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ చెంతకు చేరడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీరితో కలిపి మంతనాలు జరిపారు. అయితే వీరందరూ పార్టీ వదలడానికి కారణం లేకపోలేదని చెప్పాలి. సత్యవేడు నియోజకవర్గంలో తన అనుచరుడికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టికెట్ ఇప్పించడంతో స్థానికంగా ఉన్నవారికి కాకుండా బయట వారికి టికెట్ ఎలా ఇస్తారన్న అంశం తెరపైకి వచ్చింది.

ఈ విధంగా అనుచరుడికి టికెట్ ఇప్పించాము అన్న ఆనందం పెద్దిరెడ్డికి ఒక్క క్షణం కూడా లేకుండా పోయిందని చెప్పాలి. పెద్ద ఎత్తున పార్టీకి కార్యకర్తలు నాయకులు రాజీనామా చేయడంతో మంత్రి పెద్దారెడ్డి ప్రయత్నాలు ఏమాత్రం సఫలం కాలేదని తెలుస్తుంది. అయితే కేవలం సూళ్లూరుపేటలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -