Roja: సినిమాను ఆడించుకోలేని పవన్ జగన్ ను ఆడిస్తాడంట.. రోజా సంచలన వ్యాఖ్యలు వైరల్!

Roja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా విశాఖ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీ సర్కార్ పై జగన్ మోహన్ రెడ్డి పై భారీగా విమర్శలను గుప్పించిన విషయం తెలిసిందే. వైసీపీ నేతల అవినీతి చిట్టా తన దగ్గర ఉందని, దాని సాయంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్ ను ఒక ఆట ఆడిస్తాను అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు మాటల దాడి మొదలు పెట్టారు. వరుసగా వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు పవన్ కళ్యాణ్ పై మాటలు దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ పై వైసీపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన సినిమాను నాలుగు ఆటలు ఆడించుకోలేక చతికిల పడ్డ బ్రో పవన్, జగన్ ను ఆడిస్తాడంటా అంటూ సెటైర్లు వేశారు. జగన్ ను ఆడించడం, ఓడించడం దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే కాలేదంటూ పవన్ కళ్యాణ్ ని తిడుతూనే జగన్ ని ఆకాశానికి ఎత్తేసింది రోజా. చంద్రబాబు ఆడుతున్న రాజకీయ ఆటలో పవన్ అరటిపండని, అటువంటి పవన్, జగన్ ను ఏం ఆడిస్తాడంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పిన మాటలు,ఎల్లో మీడియా రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప పవన్ కు ఏమీ రాదని చురకలంటించారు. చంద్రబాబు మాట్లాడింది పవన్ కూడా మాట్లాడతారని ఎద్దేవా చేసింది రోజా. అంతేకాకుండా జనసేనకు జెండా, ఎజెండా లేవని చెప్పుకొచ్చారు.

 

ప్రజారాజ్యం, జనసేనలను నమ్ముకున్న వారి కోసం ఇది చేశామని చెప్పే పరిస్థితి కూడా లేదని అన్నారు. చంద్రబాబుకు ఓటు వేయాలి అని పవన్ పరోక్షంగా అభ్యర్థిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. మీ తల్లిని, కార్యకర్తలను తిడితే కనీసం పట్టించుకోలేదని, ప్యాకేజీ కోసం పవన్ లొంగుతారని ఎద్దేవా చేశారు. బాలకృష్ణ ఇంటర్వ్యూకి పవన్ వెళ్తారని, చంద్రబాబు ఇంటికి వెళ్తారని, టీడీపీకి ఓటు వేయమని కూడా చెబుతారని ఇదేనా జనసేన రాజకీయం అని ప్రశ్నించారు రోజా. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అంటూ పవన్ కళ్యాణ్ పై జనసేన పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు రోజా.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -