Bandi Sanjay: బండి సంజయ్ అరెస్ట్.. రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. జనగామ జిల్లాలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని పామ్మూర్ లో బండి ప్రజాసంగ్రామ పాదయాత్ర చేపడుతున్నారు. ఇందులో భాగంగా తాను బస చేసిన చోటే సోమవారం బీజేపీ నేతలపై దాడులనే నిరసిస్తూ , హత్యాయత్నం కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ దీక్ష చేపట్టారు. గంటసేపు నిరసన దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ శాంతిభద్రతలకు ఆటంకం కలుగుతుందనే కారణంతో బండి సంజయ్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

అనంతరం బండిని అరెస్ట్ చేయగా.. బీజేపీ నేతలు, కార్యకర్తలు పోలీస్ వాహనానికి అడ్డుపడ్డారు. వాహనం కదలకుండా నిలువరించారు. పోలీసులతో బీజేపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. కేసీఆర్ ఢాం..ఢాం అంటూ పెద్ద ఎత్తున నినాదులు చేశారు. పోలీస్ వాహనాన్ని కదలనీయకుండా చేశారు. బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బండి సంజయ్ ను అరెస్ట్ చేసి కరీంనగర కు తరలించారు.

బండి సంజయ్ అరెస్ట్ తో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ఇక హైదరాబాద్ లో ఎమ్మెల్యే రాజాసింగ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు బీజేపీ నేతల అరెస్ట్ తో రాష్ట్రంలో టెన్షన వాతావరణం నెలకొంది. నేతల అరెస్ట్ లను బీజేపీ వర్గాలు ఖండిస్తున్నాయి. బీజేపీ నేతలు, కార్యకర్తలపై కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితను పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆమె ఇంటిని ముట్టడించారు. ఆమె ఇంటి ముందు నిన్న పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కవిత ఇంటి ముందు ధర్నాకు దిగిన బీజేపీ శ్రేణులపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. తమ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.

ఇందులో భాగంగా జనగామ జిల్లాలో దీక్ష చేపట్టిన బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ కార్యకర్తలపై పెట్టిన హత్యాయత్నం కేసులను వెనక్కి తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -