Geethanjali: గీతాంజలిది ఆత్మహత్యా..? హత్యా? గీతాంజలి ఫోన్ ఎక్కడ ఉందని పశ్నిస్తూ?

Geethanjali: తెనాలికి చెందిన గీతాంజలి ఇటీవల రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె రైలు కింద పడి తీవ్రమైనటువంటి గాయాలు పాలవడంతో తనని గుంటూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే తనకు గాయం తీవ్రంగా కావడంతో గీతాంజలి మరణించారు. అయితే ఈమె మరణానికి సోషల్ మీడియాలో తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ కారణమంటూ ఇప్పటికే వైసీపీ పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారాన్ని మొదలుపెట్టింది.

ఈ క్రమంలోనే ఈ కేసు విషయంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. గీతాంజలిది హత్యనా లేక ఆత్మహత్యనా అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేబడుతున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా గీతాంజలి ఫోన్ ఎక్కడ అనే ప్రశ్న ఎదురయింది. గీతాంజలి ఫోన్ కనుక దొరికితే ఈ కేసు దాదాపు దర్యాప్తు పూర్తవుతుందని పోలీసులు భావిస్తున్నారు.

ఈమె రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తే కనుక చాలా నెమ్మదిగా వస్తున్నటువంటి ట్రైన్ కింద ఎందుకు ఆత్మహత్యకు పాల్పడుతుందనే ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది. ఇక సోషల్ మీడియాలో ఇద్దరు తనని తోసేసారు అంటూ ఒక వార్త కూడా వైరల్ గా మారింది. ఒకవేళ తోసేవాళ్ళు నెమ్మదిగా వచ్చే రైలు కింద కాకుండా చాలా వేగంగా వచ్చే రైలు కింద తోసి వేస్తారు. పొరపాటున గొడవ కారణంగా అలా అనుకోకుండా రైలు కింద పడిందా అన్న అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

ఇక గీతాంజలి పోస్ట్మార్టం రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. ఈ రిపోర్ట్ వస్తే కీలక ఆధారాలు కూడా బయటపడతాయని తెలుస్తోంది. ఏది ఏమైనా తీరా ఎన్నికల సమయంలో గీతాంజలి అనే మహిళ మరణించడంతో దానిని వైసీపీ ప్రభుత్వం వారికి అనుగుణంగా మార్చుకుంటూ ఎన్నికల ముందు శవ రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షం పార్టీలు విమర్శలు కురిపిస్తున్నాయి. అయితే ఈ ఘటన గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -