Chittoor: చిత్తూరులో హోరాహోరీ పోరు.. ఏ పార్టీ ఎన్ని స్థానాలలో గెలుస్తుందో మీకు తెలుసా?

Chittoor:  చిత్తూరు జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. మాజీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయినప్పటకీ టీడీపీ క్లీన్ స్వీప్ చేసిన దాఖలాలు లేవు. 2104లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎక్కువ సీట్లు వైసీపీ గెలుచుకుంది. అంత ఇంట్రస్టింగ్ గా ఇక్కడి రాజకీయాలు ఉంటాయి.

అయితే.. ఈసారి చిత్తూరు జిల్లా టీడీపీకి మెరుగ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. వైసీపీ అరాచకాలు, బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఈసారి కూటమికి కలిసి వచ్చే అవకాశం ఉంది. మొదట కుప్పం నుంచి మొదలు పెడితే.. టీడీపీ అధినేత‌ నారా చంద్ర‌బాబు కుప్పంపై కూడా ఈసారి ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ బాగా తగ్గిపోయింది. దీనికి తోడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. లోకల్ బాడీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలో వైసీసీ తనఖాతాలో వేసుకుంది. దీంతో చంద్రబాబు అప్రమ్తతం అయ్యారు. ప్రతీ 15 రోజులకు ఒకసారి కుప్పం నేతలతో సమావేశం అవుతున్నారు. అంతేకాదు.. గ్రామగ్రామానా కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈసారి చంద్రబాబు మెజార్టీ బారీగా పెరిగే అవకాశం ఉంది.

పుంగనూరు నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఉన్నారు. టీడీపీ నుంచి చ‌ల్లాబాబు పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ కంటే బీసీవై పార్టీ నేతల రామచంద్రయాదవ్.. పెద్దిరెడ్డికి చెవిలో జోరీగలా తయారైయ్యారు. రామచంద్రయాదవ్ ని పెద్దిరెడ్డి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా.. ఆయన మాత్రం తగ్గడం లేదు. దీంతో.. ఆయన లోపాయికారి టీడీపీకి సపోర్టు చేసే అవకాశం ఉంది. దీనికి తోడు పెద్దిరెడ్డి క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌పై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నది. దీంతో పెద్దిరెడ్డిపై వ్యతిరేకత ఉంది కానీ.. ఆయనకు బలగం ఎక్కువ ఉంది. ఏం చేసైనా గెలవాల్సిందే అన్నట్టు ఉన్నారు ఆయన.

తిరుపతి నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి భూమన కరుణాకర్ రెడ్డి విజ‌యం సాధించాడు. ఈసారి ఆయ‌న కుమారుడు భూమ‌న అభిన‌య్ రెడ్డి వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నాడు. కూట‌మి నుంచి జ‌నసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పోటీలో ఉన్నారు. తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అన్యమత ప్రచారం వైసీపీపై వ్యతిరేకత పెంచింది. కానీ.. ఆరణి శ్రీనివాసులకు జనసేనలోనే వర్గపోరు ఉంది. పైగా స్థానికత అంశం కూడా తెరపైకి వస్తుంది. కాబట్టి గెలుపు అవకాశాలు ఇప్పుడు అంచనా వేయలేం

గంగాధర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి కె. నారాయ‌ణ స్వామి విజ‌యం సాధించారు. ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పదేళ్లలో నియోజవర్గానికి ఆయన చేసిందేమీ లేదు. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయి. దీంతో.. జగన్ ఆయన్ని తప్పించి ఆయన కుమార్తె కృపా లక్ష్మీకి టికెట్ ఇచ్చారు. అయితే.. ఆ ఇంట్లోనే అధికారం ఉంటుందని.. ఆమె గెలిస్తే నారాయణ స్వామి పెత్తనమే నడుస్తుందని కనుక వైసీపీకి ఓటు వేసే పరిస్థితి లేదని ప్రజలు అంటున్నారు.

పూతలపట్టు నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పటి వరకూ టీడీపీ గెలిచిందే లేదు.గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ తరుఫున గెలిచిన ఎంఎస్ బాబును తప్పించి డాక్ట‌ర్‌ సునీల్ కుమార్ కు జగన్ టికెట్ ఇచ్చారు. దీంతో పూతలపట్టులో వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. దానికితోడు జ‌న‌సేన‌, బీజేపీతో పొత్తు టీడీపీతో కలిసి వస్తుంది.

న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆర్కే రోజా 2014, 2019 విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అభ్య‌ర్థి గాలి భానుప్ర‌కాశ్ ఆమెపై ఓడిపోయారు. ఈసారి కూడా ఆయననే రోజాపై పోటీ చేస్తున్నారు. రోజా ఫ్యామిలీపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్షాలే కాకుండా సొంతపార్టీలో కూడా ఆమెపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమెకు టికెట్ కూడా ఇవ్వొద్దని చాలా మంది వైసీపీ అధినేతకు చెప్పారు. రోజాకు టికెట్ ఇస్తే ఓడిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. దీంతో.. కానీ.. జగన్ ఆమెకే మరోసారి అవకాశం కల్పించారు. వైసీపీ నేతలే ఆమెను ఓడిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి పార్టీకి కంచుకోట‌. కానీ గత ఎన్నికల్లో వైసీపీ అభ్య‌ర్థి బియ్య‌పు మ‌ధు సూద‌న్ రెడ్డి విజ‌యం సాధించాడు. ఇక్కడ నుంచి టీడీపీ నేత బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి ఐదుసార్లు విజ‌యం సాధించాడు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న కుమారుడు బొజ్జ‌ల వెంక‌ట సుధీర్‌రెడ్డి టీడీపీ తరుఫున పోటీచేసి ఓడిపోయారు. ఈ సారి కూడా మ‌ధు సూద‌న్ రెడ్డి, సుధీర్‌ రెడ్డిలే త‌ల‌ప‌డుతున్నారు. మధుసూదన్ రెడ్డి అసెంబ్లీలో కామెడీ చేయడం తప్పా నియోజవర్గంలో అభివృద్ది చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి ఐదేళ్లుగా హైదరాబాద్ కే పరిమితం అయ్యారనే ప్రచారం ఉంది. ఎన్నికలకు ఏడాది ముందు ప్రజల్లో తిరుగుతున్నారని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ టీడీపీని గెలిపించవచ్చు.

చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థి గుర‌జాల జ‌గ‌న్మోహ‌న్, వైసీపీ అభ్య‌ర్థిగా ఎం. విజ‌యానంద‌రెడ్డి బ‌రిలోకి దిగుతున్నాడు. విజ‌యానంద్ రెడ్డిపై అనేక అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఎర్రచందనాన్ని కొల్లగొట్టి కోట్లు సంపాదిస్తున్నారన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీంతో ఆయనకు ఓటమి తప్పదని అంటున్నారు. చంద్రగిరి నుంచి 2014, 19లో చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి వైసీపీ తరుఫున పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆయ‌న్ను నెల్లూరు ఎంపీ అభ్య‌ర్థిగా వైసీపీ ప్రకటించింది. చంద్రగిరి నుంచి చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్నారు. టీడీపీ నుంచి పులివ‌ర్తి వెంక‌ట‌మ‌ణిప్ర‌సాద్ పోటీ చేస్తున్నాడు. చంద్రగిరిలో వైసీపీ ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. బీజేపీ, జనసేనతో జట్టుకట్టడం టీడీపీకి కలిసి వస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -