Ram Charan-NTR: రామ్ చరణ్ మా పార్టీ అంటూ జనసేన పార్టీ నాయకుల రచ్చ?

Ram Charan-NTR: స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా.. ఈ సినిమా దయతో పాన్ ఇండియా స్టార్ లుగా వెలుగుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ వరల్డ్ వైడ్ గా వచ్చే సినిమాల అవకాశాలు అందుకుంటున్నారు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా దయతో ఎన్టీఆర్ రాజకీయ నాయకుల కండ్లల్లో పడ్డాడు. సినిమాలో ఎన్టీఆర్ నటన బాగా నచ్చి.. బీజేపీ నేత హోమ్ మంత్రి అమిత్ షా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ని కలిశాడు. ఆ సినిమాలో తన నటన అద్భుతంగా ఉందని తనకు ప్రశంసల వర్షం కురిపించాడు. మరి అమిత్ షా ఎన్టీఆర్ ని కలవడంలో లో రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయని కొందరు భావిస్తున్నారు.

ఈ భావనలు నిజమయ్యేలా.. బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మేము జూనియర్ ఎన్టీఆర్ సేవలను పార్టీ కోసం వాడుకుంటామని చెప్పేశాడు. మరి జనసేన పార్టీ ఏమాత్రం తగ్గుకుండా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మాక్కూడా ఒక ఆర్ఆర్ఆర్ హీరో ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు. వచ్చే ఎన్నికల్లో రామ్ చరణ్ జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తాడని డిబేట్లో చెప్పకు వచ్చాడు. మొత్తానికి బొలిశెట్టి బీజేపీకి పెద్ద బాంబ్ పెల్చాడు.

అంటే బాబాయి పార్టీకి అబ్బాయి ప్రచారం చేసాడన్నమాట. ఇక చరణ్ జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు మొత్తం జనసేన పార్టీకి ఓట్లు వేయడానికి ఆసక్తి చూపుతారు అని తెలుస్తుంది. మరి నిజంగా చరణ్ జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తాడో లేదో తెలియదు. కానీ ప్రస్తుతం రాజకీయాలు మాత్రం టాలీవుడ్ హీరోలపై పడ్డాయి. మరి దీని గురించి చరణ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. రామ్ చరణ్ ఆర్.సి 15 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -