Pothina Mahesh: విజయవాడలో వెస్ట్ లో పోతిన మహేష్ అసలు బలం ఇదే.. వైసీపీని ముంచేస్తాడా?

Pothina Mahesh: ఏపీ రాజకీయాల్లో హాట్ సీటుగా ఉన్న నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ నుంచి జనసేన తరుఫున పోతిన మహేష్ పోటీ చేయాలి అనుకున్నారు. పవన్ కళ్యాన్ కూడా ఆయనకే టికెట్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లింది. బీజేపీ కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరిని బరిలో దించింది. దీంతో.. కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న పోతిన వెంకట మహేష్ జనసేనకు గుడ్‌బై చెప్పేశారు. జనసేన పార్టీకి, పదవులకు పోతిన రాజీనామా చేశారు. పొత్తుల్లో భాగంగా బెజవాడ వెస్ట్ బీజేపీకి కేటాయించడంతో అసంతృప్తికి గురైన పోతిన జనసేనానిపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. అంతేకాదు వెంటనే వైసీపీలో కూడా చేరిపోయారు. వైసీపీలో చేరిన పోతినకు టికెట్ దక్కే పరిస్థితి లేదు. కానీ.. వైసీపీలో చేరి పవన్ పై సంచలన కామెంట్స్ చేశారు. జనసేనలో పెద్ద కోవర్ట్ పవనే అని అన్నారు. ఆయన టీడీపీ కోసం పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ భవిష్యత్తును పవన్ కళ్యాన్ నాశనం చేసారని మండిపడ్డారు. ఏ లెక్కలతో వైసీపీలో చేరారో కాని .. వెళ్తూ వెళ్తూ జనసేనానిని ఒక రేంజ్లో టార్గెట్ చేశారు. టికెట్ దక్కకపోతే పవన్ ఫఓటో పెట్టుకుని గెలుస్తానని గతంలో చెప్పిన ఆయన .. ఇప్పుడు అసలు పవన్‌కి వ్యక్తిత్వమే లేదని అన్నారు. స్వార్ధప్రయోజనాలు కోసమే పవన్ పార్టీ పెట్టారని… టీడీపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని … ఈ ఎన్నికల తర్వాత జనసేన పార్టీనే ఉండదని జోస్యం చెప్తున్నారు

విజయవాడ వెస్ట్‌లో పార్టీని బలపరిచానని పోతిన మహేష్ చెబుతున్నారు. కానీ, ఆయన ఎంత బలపరిచారో.. అసలు ఆయనకు గెలుపు అవకాశాలు ఎంత ఉన్నాయో లెక్కలు చూస్తే తేలిపోతుంది. ఎందుకంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు విజయవాడ వెస్ట్ నుంచి ఆ పార్టీ తరుఫున వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచారు. త్రిముఖ పోరులో కూడా ఆయనకు 35 శాతం ఓట్లు వచ్చాయి. అంటే పవన్ కు అక్కడ సంస్థాగతంగా బలం ఉంది. అలాంటి నియోజకవర్గాన్ని పోతిన మహేష్ చేతిలో పవన్ పెట్టారు. మరి ఆయన దాన్ని ఎంతవరకు వినియోగించుకున్నారు? 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని జనసేన పోటీ చేసింది. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన తరుఫున పోతిన మహేష్ పోటీ చేశారు. ఆయనకు 14 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. గత ఎన్నికల్లో అన్ని పార్టీల అంచనా బట్టి ఆ విజయవాడ వెస్ట్ జనసేన ఖాతాలో పడాల్సింది. కానీ..పోతినకు 14 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

2014 నుంచి నియోజకవర్గాన్ని చూసుకుంటున్న పోతిన మహేష్ 21 శాతం ఓట్లు కోల్పోయారంటే ఆయన నాయకత్వంపై ఎవరికి అయినా అనుమానం వస్తుంది. పోతిన మహేష్ దుందుడుకు చర్యలు, నోటి దురసుతోనే బలంగా ఉన్న నియోజకవర్గాన్ని దూరం చేసుకున్నారు. విజయవాడ వెస్ట్ లో జనసేన అంటే పోతిన, పోతిన అంటే జనసేన అన్నట్టు వ్యవహరించేవారు. అందుకే, అక్కడ సీనయర్లు సైతం ఆయనను పట్టించుకోలేదు. చివరికి ఒక్కడే అయ్యాడు. పార్టీ బలంతో పాటు నాయకుడి బలం కూడా ఉంటే ఎవరైనా గెలుస్తారు. పోతిన తన నాయకత్వాన్ని నిరూపించుకోలేదు సరికదా.. ఆయన చర్యలతో పార్టీ బలాన్ని కూడా బలహీనంగా మార్చారు.

పవన్ మొదటి నుంచి యువతను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కిరణ్ రాయల్, పంచకర్ల సందీప్, పోతిన మహేష్ కి మంచి ప్రియారిటీ ఇచ్చారు. కిరణ్ రాయల్ కు కూడా టికెట్ ఇవ్వలేదు. ఆయన కూడా కొన్ని రోజులు అలబూనారు. కానీ, పార్టీ ప్రధాన టార్గెట్ వైసీపీని దించి.. అసెంబ్లీలో అధికార కూటమి తరుఫున అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఫిక్స్ అయ్యారు. అందుకే.. టికెట్ రాకపోయినా.. ఆయన పార్టీ కోసం పని చేస్తున్నారు. ఇప్పుడు పోతిన మహేష్ పార్టీ మారి… ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -