AP Electricity: ఏపీలో విద్యుత్ కోతలు మొదలు.. పవర్ కట్ వల్ల జగన్ పవర్ కట్ అయ్యే ఛాన్స్ ఉందా?

AP Electricity: ఏపీలో కరెంటు కోతలు అనే మాట ఓ తరానికి ముందు విన్నాం. ఇప్పుడు అలాంటి మాట వినాల్సిన పని లేదనే అనుకుంటాం. పైగా రాష్ట్ర విభజన తర్వాత కరెంటు కోతలు అనే మాట అసలు వినిపించాల్సిన పని లేదు. కానీ, జగన్ సీఎం అయిన తర్వాత.. పవర్ కట్స్ అడపాదడపా వింటున్నాం. రోజుకో గంట, గంటన్నర. దానికి కొన్నేళ్లు అలవాటు పడిన ప్రజలు మామూలే అనుకుంటున్నారు. అయితే, ఇప్పుడు గంటకాదు.. ఏకంగా ఎనిమిది గంటలు పవర్ కట్స్ ఉంటాయి. అవును, ఏపీలో మరి కొన్ని రోజుల్లో అంటే.. ఎన్నికలకు ముందే కరెంట్ కోతలు తీవ్రం అవుతాయని తెలుస్తోంది. ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన కరెంట్ కోతలు తప్పవని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో బొగ్గు కొరత, విద్యుత్ కంపెనీలకు ప్రభుత్వం బకాయిల కారణంగా వేసవిలో గంటల తరబడి విద్యుత్ కోతలు విధించక తప్పని పరిస్థితి ఏర్పడింది. బొగ్గు, విద్యుత్ కంపెనీలకు రాష్ట్రంలో వైసీపీ సర్కార్ రూ. 35 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో.. బొగ్గు కొనుగోళ్లు నిలిచిపోయాయి. అటు, హైడ్రో, సోలర్ కంపెనీలకు కూడా రూ.18 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. అది ఆయా కంపెనీల నుంచి కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రం తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కొంటుంది. పెద్ద ఎత్తున బకాయిలు పడటంతో విద్యుత్ కొనుగోలుకు మార్గాలు మూసుకుపోయాయి. దీంతో.. ఎన్నికలకు ముందు ఏపీ తీవ్రమైన కరెంట్ కోతలను ఎదుర్కొంటుందని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో రోజుకు 8 గంటలు, సిటీల్లో రోజుకు 6 గంటలు కరెంట్ కోతలు ఉండొచ్చని అంటున్నారు.

వాతావరణ శాఖ ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్టోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది. పరిస్థితులు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. జనవరి చివరివారంలోనే ఎండలు మండేలా ఉన్నాయి. మార్చిలోనే ఎవరూ బయటకు రాలేదని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి మండుటెండలో కరెంట్ కోతలు ఉంటే జనాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అసలే ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ సమయంలో కరెంటు కోతలు కూడా తోడైతే వైసీపీ ఇంటికి పోవడం ఖాయమని విశ్లేషణలు వినిపిస్తున్నారు. ఏపీలో పవర్స్ కట్స్ ఉంటే.. జగన్ పవర్ కూడా కట్ కావడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి జగన్ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మిగులు పవర్ ఉండేది. అలాంటి రాష్ట్రాన్ని కరెంట్ కోతలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మేలో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల ముందు ఏమైనా పవర్ కట్స్ ఉంటే .. జనం జగన్ కు కూడా పవర్ కట్ చేసి ఇంట్లో కూర్చొబెడతారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -