Pawan Kalyan: వైరల్ అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికలలో తాను టిడిపితో కలిసి పొత్తు పెట్టుకోబోతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా జగన్ సర్కార్ గద్దే దింపడం కోసం ఎన్నికలలో పొత్తుకు సిద్ధమయ్యానని తెలిపారు. తాను పొత్తుకు సిద్ధమైన సీఎం పదవి మాత్రం అడగనని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.ఇలా సీఎం పదవి గురించి క్లారిటీ ఇచ్చి తన గురించి జరుగుతున్నటువంటి ప్రచారానికి ఇంతటితో ముగింపు పలికారు.

బీజేపీనో.. టీడీపీనో తాను సీఎం పదవిని అడగబోనని ప్రకటించారు. షరతులు పెట్టి ముఖ్యమంత్రి స్థానాన్ని పొందలేమని స్పష్టం చేశారు. ప్రజలు కావాలని కోరుకుంటే సీఎం అవుతానన్నారు. గతంలో జరిగిన ఎన్నికలలో తనకు 30స్థానాలు కనుక ఇచ్చి ఉంటే తాను తప్పకుండా సీఎం రేసులో ఉండేవాడినని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలియచేశారు. మన బలం చూసి పదవి కోరుకోవాలని పవన్ కళ్యాణ్ తెలియచేశారు.

 

జనసేనకు పట్టు ఉన్న ప్రాంతాలలో 30శాతం ఓటింగ్ ఉందన్నరు. తమకు బలం ఉన్న మేరకే సీట్లు అడుగుతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో ఎక్కడైతే జనసేనకు మంచి పట్టు ఉందో ఆ ప్రాంతాలలో తాను తప్పకుండా పోటీ చేస్తానంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఎన్నికలు జరుగుతాయన్న వార్తలు వస్తున్నా నేపథ్యంలో తాను జూన్ నెల నుంచి ఏపీ ప్రజల మధ్యన ఉండబోతున్నానని తెలిపారు. పొత్తులకు ఒప్పుకోని వారు ఎవరైనా ఉంటే వారిని ఒప్పిస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇదే విషయం పవన్ కల్యాణ్ ఢిల్లీలో కూడా మాట్లాడానని ఈ సందర్భంగా తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -