Prabhas: ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఉదయ్ కిరణ్ పరిస్థితి ఏర్పడుతుందా?

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకొని బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు నటుడు ప్రభాస్. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ విధంగా కెరియర్లో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ కి విపరీతమైన అభిమానులు ఉన్నారు.ఇలా కెరియర్లో మంచి పొజిషన్ లో ఉన్నటువంటి ఈయన అభిమానులు ఇక ఈయన పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతో ముచ్చట పడుతున్నారు.

ఇలా ప్రభాస్ ఈ పెళ్లి వార్త ఎప్పుడు చెబుతారా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నాలుగు పదుల వయసులోకి అడుగు పెట్టిన ప్రభాస్ వెంటనే పెళ్లి చేసుకోకపోతే అనంతరం పెళ్లి చేసుకున్న ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటూ అభిమానులు ఈయన పెళ్లి పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఇలా ప్రభాస్ పెళ్లి గురించి శుభవార్త ఎప్పుడు చెబుతారా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభిమానులకు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి షాకింగ్ న్యూస్ చెప్పారు.

ఈ మధ్యకాలంలో వేణు స్వామి నటీనటుల జాతకాలు చెబుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈయన చెప్పినవి కొన్ని నిజం కావడంతో ఈయన పలువురు సెలబ్రిటీల గురించి పెద్ద ఎత్తున జాతకాలు చెప్పడమే కాకుండా వారి గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రభాస్ జాతకం గురించి మరోసారి ఈయన మాట్లాడుతూ ఆయన జాతకంలో పెళ్లి యోగమే లేదని తెలిపారు. అలా కాదని పెళ్లి కనుక చేసుకుంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వేణు స్వామి వెల్లడించారు.

ప్రభాస్ జీవితంలో పెళ్లి అచ్చి రాదని అలా కాకుండా ఈయన పెళ్లి కనుక చేసుకుంటే నటుడు ఉదయ్ కిరణ్ పరిస్థితి తనకు ఎదురవుతుందని వేణు స్వామి షాకింగ్ న్యూస్ చెప్పారు.ఈ విధంగా వేణు స్వామి ప్రభాస్ జీవితం కూడా ఉదయ్ కిరణ్ జీవితంలా మారుతుంది అని చెప్పడంతో అభిమానులు ప్రభాస్ కి పెళ్లి కాకపోయినా పర్వాలేదు ఆయన బాగుండాలి అంటూ కోరుకుంటున్నారు. మొత్తానికి వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -