Prabhas Food: ఆ బ్యూటీ కూడా ప్రభాస్ భోజనానికి ఫిదా అయ్యారా.. ఏం జరిగిందంటే?

Prabhas Food: ప్రభాస్ త్వరలో కల్కి 2898AD సినిమాతో రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల సలార్ తో హిట్ కొట్టిన ప్రభాస్ మే 9న కల్కి సినిమాతో రాబోతున్నాడు. నాగ అశ్విన్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా.ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. కల్కి సినిమాపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి.

 

తాజాగా ఈ సినిమాలో మరొక మలయాళీ భామ అన్నా బెన్ జాయిన్ అయింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ జూమ్ కాల్ ద్వారా తనకు కల్కిలో ఆఫర్ ఇచ్చారని తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. ఇప్పటికే ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశాపటాని, అమితాబచ్చన్లతోపాటు దర్శక ధీరుడు రాజమౌళి, దగ్గుపాటి రానా, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ఈ సినిమాలో గెస్ట్ హౌస్ లో కనిపిస్తున్నారు.

హిందూ మైథాలజీ కథతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఇక అన్నా బెన్ విషయానికి వస్తే ఈమె ఈ సినిమాలో నటిస్తున్నందుకు ఆనంద పడుతున్నట్లు, అలాగే కల్కి సెట్స్ లో వడ్డించే తెలుగు వంటకాలను ఎంతో ఇష్టపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ ఇంటి నుంచి తనకు ఫుడ్ వచ్చిందని తెలిపింది.

 

ఇప్పటివరకు ఆయనని పర్సనల్గా కలవలేదు కానీ నా కోసం ఆయన ఫుడ్ పంపిస్తారని నేను ఎక్స్పర్ట్ చేయలేదు ఆ ఫుడ్ ని ఎంతో ఇష్టంగా తిన్నాను. త్వరలోనే పర్సనల్ గా ఆయనని కలవాలి అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. ఇక కల్కి విషయానికి వస్తే 600 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ప్రభాస్ డిఫరెంట్ కట్టసులో కనిపించబోతున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -