Prabhas: ప్రభాస్ కల్కి రైట్స్ కోసం ఏకంగా ఈ రేంజ్ లో డిమాండ్ ఉందా?

Prabhas: సినిమా జయపజయాలతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నాయి ప్రభాస్ సినిమాలు. సినిమా వ్యాపారానికి పర్యాయపదంగా మారుతున్నాడు యంగ్ రెబల్ స్టార్. తాజాగా ప్రభాస్ రాబోయే భారీ బడ్జెట్ కల్కి 2898 ఏడి ఓవర్సీస్ హక్కులకు విపరీతమైన క్రేజ్ ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. కల్కి ఓవర్సీస్ రైట్స్ కోసం మేకర్స్ 100 కోట్లు కోట్ చేస్తున్నట్లు సమాచారం.డిస్ట్రిబ్యూటర్లు 70 నుంచి 75 కోట్ల ఆఫర్లతో సిద్ధంగా ఉన్నారని చెప్పబడింది.

 

అయితే నిర్మాతలు సినిమాను 100 కోట్లకు విక్రయించడానికి ఆసక్తిగా ఉన్నారు. 100 కోట్లకు ఎవరు హక్కులు తీసుకోవడానికి సిద్ధంగా లేకుంటే వారు తమ సొంతంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు నిర్మాతలు. ఈ చిత్రంపై పూర్తిగా నమ్మకంతో ఉన్నారు. రిపోర్టుల ప్రకారం మేకర్స్ ఓవర్సీస్ మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాలలోనూ ఈ పద్ధతినే పాటిస్తున్నారు.సినిమా కంటెంట్, సక్సెస్ పై కాన్ఫిడెంట్గా ఉండటంతో ప్రతి ఏరియాలోను ఎక్కువ ధరలు పలుకుతున్నారు.

ఆర్ ఆర్ ఆర్ కంటే ఎక్కువ గా ఈ సినిమా కోసం నిర్మాత డిమాండ్ చేస్తున్నారంట. సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని, దేశవ్యాప్తంగా 22 భాషలలో ఏకకాలంలో రిలీజ్ కాబోతుందని ఇంగ్లీష్ వెర్షన్ కూడా అప్పుడే రాబోతుందని మూవీ టీం చెప్పుకొచ్చింది.మే 9న రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ సినిమా కమర్షియల్ మూవీ గా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిప్రజెంట్ చేస్తున్నారు.ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

 

ఈ చిత్రంలో కమల్ హాసన్ ప్రతినాయకుడిగా నటిస్తూ ఉండగా అమితాబచ్చన్ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. అలాగే దీపికా పదుకొనే హీరోయిన్ గాp చేస్తుంది. దిశా పటాని ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అంతేకాకుండా వివిధ భాషలలోని అగ్ర నటులందరూ ఈ సినిమాలో నటించబోతున్నారు. భారీ క్యాస్టింగ్ తో నాగ్ అశ్విన్ రెండు భాగాలుగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నిర్మాత అంతగా డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -