Prakasam Distric YCP: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ ఉక్కిరిబిక్కిరి.. ఆ మూడు ప్రాంతాల్లో గెలుపు కష్టమేనా?

Prakasam Distric YCP: గత ఎన్నికల్లో వైసీపీ చాలా జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒకటి. అయితే.. ఈసారి ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ గాలి ఆడక అధినేతకు ఉక్కపోస్తుందని చర్చ నడుస్తోంది. జిల్లాలో అసమ్మతి రాగాలు తారా స్థాయికి చేరాయి. ముగ్గురు సిట్టింగులకు జగన్ టికెట్ నిరాకరించారు. టికెట్ ఆశించి బంగపడినన ఎమ్మెల్యేలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ప్రస్తుతం అభ్యర్థులకు సహకరించపోగా వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ప్రజల్లో పార్టీపై, ప్రభుత్వంపై వ్యతిరేకతను గుర్తించిన జగన్.. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారు. అయితే.. ఈ మార్పు ఏకంగా ప్రభుత్వాన్నే మార్చేస్తుందా? అనే అనుమానాలను పెంచుంతోంది. ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పరిస్థితికి అద్దం పడుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేడిశెట్టి వేణుగోపాల్, సుధాకర్ బాబు, మహీధర్ రెడ్డికి జగన్ టికెట్ నిరాకరించారు. సిట్టింగ్ స్థానంలో కాకపోయినా.. వేరే స్థానంలో కూడా టికెట్ ఇవ్వడానికి జగన్ ఆసక్తి చూపించ లేదు. చివరి క్షణం వరకూ ఏదో ఒక స్థానంలో టికెట్ రాకపోతుందా.. అని ఎదురుచూసిన ఆ ముగ్గురు నేతల ఆశలు అడియాశలు అయ్యాయి. దీంతో ఆ ముగ్గురు నేతలు ఇప్పుడు వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కందుకూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరుపు మహీధర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. అయితే జగన్ ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వలేదు. దీంతో.. ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఒక దశలో ఆయన టీడీపీలో చేరుతారని కూడా వార్తలు వచ్చాయి. టీడీపీ నేతలతో మంతనాలు జరిగినట్టు తెలిసింది. కానీ.. టీడీపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన సైలంట్ అయ్యారు. ఛాన్స్ దొరికితే టీడీపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారని.. లేదంటే ఇంట్లో కూర్చొనే స్థానిక వైసీపీ అభ్యర్థిని ఓడిస్తానని సన్నిహితులతో చెబుతున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి కందుకూరులో గెలవనివ్వనని తేల్చిచెబుతున్నారట. దీంతో.. కందుకూరు వైసీపీ ఖాతా నుంచి జారిపోయిట్టేనని ప్రచారం జరుగుతోంది.

ఇక గత ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి మేడిశెట్టి వేణుగోపాల్ పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆయనకు కూడా అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. దర్శి టికెట్ కాకపోతే.. ఒంగోలు ఎంపీ టికెట్ అయినా ఇవ్వాలని జగన్ ను కోరారట. కానీ.. జగన్ మాత్రం ససేమీరా అన్నారని టాక్ నడుస్తోంది. మొత్తానికి ఆయనకు కూడా జగన్ మొండిచేయి చూపించారు. దీంతో ఆయన పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ ప్రచారంలో పాల్గొనేదే లేదని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు… పార్టీ కార్యక్రమాల్లో, ప్రచారంలో పాల్గొనవద్దని ఆయన అనుచరులకు కూడా ఆదేశాలు జారీ చేశారనట. టైం చూసుకొని టీడీపీ లేదా జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రయత్నాలు ఫలించకపోతే.. సైలంట్ గా ఉంటారట. వీలైంతే నియోజవర్గంలో వైసీపీని ఓడిస్తారనే ప్రచారం కూడా ఉంది.

సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన సుధాకర్ బాబు.. ఈసారి కూడా టికెట్ ఆశించారు. అయితే, ఆయనకు ఈసారి టికెట్ రాలేదు. దీంతో.. ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధిష్టానం సుధాకర్ బాబుని బుజ్జగించేందుకు దూతలను రంగంలోకి దించింది. అయితే, ఆయన మాత్రం ఏమాత్రం లొంగలేదట. సంతనూతలపాడు టికెట్ కాకుండా ఒంగొలు లోక్ సభ నియోజకవర్గ డిప్యూటీ కోఆర్డినేటర్ పదవి ఇస్తామని అధిష్టానం ఆఫర్ చేసింది. సంతనూతల పాడు నియోజకవర్గంలో ఆయనకు గట్టి పట్టుంది. అందుకే ఆయన అదే సీటు ఆశిస్తున్నారు. మరోవైపు ఆయన మద్దతు లేకుండా అక్కడ కొత్తవారు గెలిచే అవకాశం లేదని జగన్ కూడా నమ్ముతున్నారు. అందుకే.. జగన్ బుజ్జగింపులకు దిగుతున్నారు. కానీ.. సుధాకర్ బాబు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నేడో రేపో పార్టీ వీడే అవకాశాలున్నాయనీ అంటున్నారు. జిల్లా వైసీపీకి చెందిన మరికొందరు కీలక నాయకులతో కలిసి ఆయన టీడీపీ లేదా జనసేన గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఆయన సంతనూతలపాడు వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదు. అంతేకాదు.. తన వర్గాన్ని కూడా కొత్త అభ్యర్థితో తిరగొద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో… సంతనూతల పాడు టికెట్ కూడా ప్రతిపక్షాల ఖాతాలో పడటం ఖాయంగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -