Prashanth Kishor: జనసేనతో పొత్తు కోసం వైసీపీ ప్రాధేయపడిందట.. ప్రశాంత్ కిషోర్ సంచలన విషయాలు రివీల్ చేశారుగా!

Prashanth Kishor: ఇప్పటికే ఎండలు మండిపోతున్నటువంటి తరుణంలో ఏపీలో మరింత వేడి పెరిగింది. ఒకవైపు ఎండ తీవ్రత మరోవైపు రాజకీయ వేడి రాజుకుంటుంది త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున అన్ని పార్టీ నేతలు గెలుపు కోసం పోరాటం చేస్తున్నారు. అయితే తాజాగా వైఎస్సార్సీపీ పార్టీ గురించి ఒక విషయం వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే.

అయితే గతంలో జనసేన పార్టీతో వైఎస్ఆర్సిపి పార్టీ పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. అయితే ఈయన ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కాదు 2017 వ సంవత్సరంలో ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అందుకు సంబంధించిన వీడియోని జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

2017 వ సంవత్సరంలో నంద్యాల ఉప ఎన్నికలు జరిగే వైసిపి పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పార్టీలోనే కొంతమంది కీలక నేతలు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సూచనలు తనకు ఇచ్చారని ప్రశాంత్ కిషోర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోని జనసేన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

ఈ వీడియోని షేర్ చేసినటువంటి జనసేన 2017 నంద్యాల ఉప ఎన్నికల తర్వాత జనసేనతో పొత్తు కోసం వైసీపీ ప్రాధేయపడింది అని పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది. కాగా ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఈ వీడియోలో ప్రశాంత్ కిశోర్ ఎప్పుడు, ఎక్కడ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -