Uttar Pradesh: ఆహారం వడ్డించే గిన్నె ముట్టుకుందని ఆ బాలికపై హెచ్‌ఎం చేసిన పనికి నెటిజన్లు ఛీ కొడుతున్నారు!

Uttar Pradesh: రాతి యుగం నుంచి రాకెట్ల యుగంలో దూసుకుపోతున్న నేటి ప్రపంచంలో ఇంకా కులాలు, మతాలంటూ తన్నుకు చస్తున్నారు. కులమతాలకతీతంగా అన్ని పదవులు, హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ.. కొన్ని ప్రాంతాల్లో నేటికీ కులం పేరుతో దూరం పెట్టడం, వారిని వేధించడం జరుగుతూనే ఉంది. ఇటీవల ఓ పాఠశాలలో దాహం వేస్తోందని కుండలో నీరు తాగాడని ఓ వర్గానికి చెందిన విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదాడు.

ఆ దెబ్బలకు ఆస్పత్రి పాలైన ఆ విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ ఘటన మరవక ముందే ఆహారం వడ్డించే పాత్రకు చేయి తగిలిందని దళిత బాలికను కులం పేరుతో దూపించి తీవ్రంగా కొట్టాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. అంతటితో ఊరుకోకుండా దివ్యాంగురాలైన ఆ బాలికపై కనీసం అవిటిదని చూడకుండా వేడి వేడి నీటిని ఆమెపై పోసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బారాబంకిలో జరిగింది.

టికైత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇచాలి గ్రామానికి చెందిన దివ్యాంగ బాలిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. రోజు లాగానే ఆగస్టు 29న బాలికను పాఠశాలకు వెళ్లింది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళ్లగా.. ఆహరం వడ్డించే పాత్రకు చేయి తగిలింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రధానోపాధ్యాయుడు మహ్మద్‌ అమీన్‌ కులం పేరుతో దూషించాడు. అంతటితో ఆగకుండా వేడివేడి నీరు తీసుకుని ఆ బాలికపై పోశాడు.

వేడి నీరు చేతిపై పడటంతో చేయి కాలడంతో ఏడుస్తూ ఆ బాలికి జరిగిన విషయం ఇంటికెళ్లి తండ్రితో చెప్పింది. విషయం అడుగుదామని సదరు బాలిక తండ్రి పాఠశాలకు రాగా.. అతడిని సైతం కులం పేరుతో దూషించాడు ఆ ప్రధానోపాధ్యాయుడు. చేసేదేమీ లేక బాధిత తండ్రి ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఘటనపై విచారించి ప్రధానోపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ప్రధానోపాధ్యాయుడిపై పలు కేసులు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -