TDP: టీడీపీలోకి ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నేత.. అసలేం జరిగిందంటే?

TDP: రానున్న ఎన్నికల్లో నేపథ్యంలో విజయవాడ అర్బన్ పాలిటిక్స్ బాగా హీట్ ఎక్కుతున్నాయి వైసీపీ నేత బొప్పన భవ కుమార్ పార్టీ మారతారని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే కేశినేని చిన్ని తో కలిసి టీడీపీ నేత నారా లోకేష్ తో సమావేశం కాబోతున్నారట భవ కుమార్. ఇప్పటికే భవకుమార్ తో వంగవీటి రాధ, కేసినేని చిన్ని, గద్దె రామ్మోహన్ తో పాటు పలువురు టీడీపీ నేతలు చర్చలు జరిపారు.

 

గతంలో వంగవీటి రాధ కి భవ కుమార్ కి మధ్య ఉన్న పాత పరిచయాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానించిన సంగతి అందరికీ తెలిసిందే. వైసీపీ అధిష్టానం పై అసంతృప్తితో ఉన్న భవకుమార్ తెలుగుదేశం పార్టీలో చేరిక ఖాయంగా కనిపిస్తోంది.లోకేష్ ని కలిసిన తర్వాత భవకుమార్ టీడీపీ లో చేరే అవకాశం ఉంది. ఈనెల 21న భవకుమార్ టీడీపీ లో చేరనున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు భవకుమార్ ని బుజ్జగించేందుకు దేవినేని అవినాష్ సహా ఇతర వైసీపీ నేతలు రంగంలోకి దిగారు.

గత ఎన్నికలలో విజయవాడ తూర్పు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన భవకుమార్ 2019 నుంచి వైసీపీ విజయవాడ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు కాగా పార్టీ వీడొద్దంటూ భవకుమార్ వద్దకు దేవినేని అవినాష్ ఇతర వైఎస్ఆర్ సీపీ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన బొప్పన భవకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

పార్టీని వీడొద్దంటూ తనపై వైసీపీ అధిష్టానం నుంచి తీవ్ర ఒత్తిడి తెస్తుందని తనకు మాత్రం వైసీపీ లో ఉండాలని ఆసక్తి లేదని, ఈ నేపథ్యంలో తాను తెలుగుదేశం పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ అధికార ధోరణి తో చాలామంది నేతలు విసిగిపోయారని ఈ నేపథ్యంలో వారంతా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -